Anasuya : నాతో పాటు చాలా మందికి లైన్ వేస్తున్నాడు.. ఆది గుట్టు విప్పిన అనసూయ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 5 November 2021, 1:40 pm

Anasuya : జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్స్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా ఆది స్కిట్‌లో పంచులు వర్షం కొనసాగుతుంది. ఇతరులకు చాన్స్ ఇవ్వకుండా మొత్తం కౌంటర్స్ అన్ని ఆది వేస్తుంటాడు. ఆది తన స్కిట్స్‌లో గెస్ట్ రోల్స్ చేసేవారిని కూడా వదలుడు. ముఖ్యంగా రీతూను అయితే ఓ ఆట ఆడుకుంటాడు. కొన్ని డైలాగ్స్ ముందుగా చెప్పకుండానే స్టేజ్‌ మీద వేసే సరికి.. మిగిలిన వారు షాక్ అవుతుంటారు. కానీ కామెడీ కోసమే కదా అని లైట్ తీసుకుంటారు.

jabardasth anchor Anasuya comments on Hyper Aadi

jabardasth anchor Anasuya comments on Hyper Aadi

యాంకర్ అనసూయ కూడా ఆది స్కిట్స్‌లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆది ఆమెపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటాడు. ఆమె అంటే తనకు ఇష్టమని చెబుతుంటాడు. అంతేకాకుండా పెళ్లి, వయసు గురించి కూడా కౌంటర్స్ వేస్తుంటాడు. అంతేకాకుండా జడ్జ్‌లు రోజా, మనోలపై పలు సందర్భాల్లో గట్టి కౌంటర్సే వేసిన సందర్బాలు ఉన్నాయి. అలా ప్రతీ సారి ఎవరి మీదో ఒకరి మీద పంచులు, సెటైర్లు వేసుకుంటూ ఆది నవ్విస్తూ ఉంటాడు.

Anasuya : ఆదిపై అనసూయ సెటైర్లు

Anasuyajabardasth anchor Anasuya comments on Hyper Aadi

Anasuyajabardasth anchor Anasuya comments on Hyper Aadi

తాజాగా ఆది స్కిట్‌లో కనిపించిన అనసూయ.. గట్టి షాకే ఇచ్చింది. ఆది గుట్టు విప్పేసింది. నాతో పాటు చాలా మందికి లైన్ వేసిన సంగతి ఎందుకు చెప్పలేదు.. అని అనసూయ ఆదిని అడుగుతుంది. అప్పుడు ఆది.. అందులో చెప్పడానికి ఏముంది.. ఆ సుధీర్ అలానే చేస్తాడు, రామ్ ప్రసాద్ అంతే చేస్తాడు, అఖరికి మనో గారు కూడా అలానే చేస్తారు అని అంటాడు. దీంతో ఒకింత షాక్‌కు గురైన.. మనో.. నేనేం చేశానయ్యా బాబు..అంటూ బదులిచ్చాడు. ఇంకా ఈ స్కిట్‌లో ఆది అనసూయ మీద భారీ పంచులే వేశాడు.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి