Jack Fruit Biryani Recipe : చికెన్ బిర్యాని ని మించిన అదిరిపోయే టేస్ట్ తో పనసకాయ దమ్ బిర్యాని….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jack Fruit Biryani Recipe : చికెన్ బిర్యాని ని మించిన అదిరిపోయే టేస్ట్ తో పనసకాయ దమ్ బిర్యాని….!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 October 2022,8:30 pm

Jack Fruit Biryani Recipe : బిర్యానీ అంటే ఎక్కువగా నాన్ వెజ్ తో చేస్తూ ఉంటారు. చికెన్ తో మటన్ తో ఎగ్స్ ,రొయ్యలు, ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ తో బిర్యాని చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నాన్ వెజ్ లేకుండా వెజ్ తో దమ్ బిర్యాని అదే ఈ పనసకాయ దమ్ బిర్యాని. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.. దీనికి కావాల్సిన పదార్థాలు; పనస ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా ,పెరుగు ,పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పొడి, ఉల్లిపాయలు, సాజీర, లవంగాలు, నల్ల యాలకులు, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, గరం మసాల,కుంకుమపువ్వు మొదలైనవి…

దీని తయారీ విధానం ; ముందుగా పనసకాయని తీసుకొని దాని పొట్టు తీసేసి దాని లోపల దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు, పసుపు వేసిన నీలలో 80% వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆరేడు స్పూన్ల ఆయిల్ వేసి ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలను వేసి ఎర్రగా వేయించి వాటిని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో పనస ముక్కలను వేసి కొద్దిసేపు వేయించి దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు స్పూన్ల కారం, కొంచెం ఉప్పు కొంచెం బిర్యానీ మసాలా, ఒక కప్పు పెరుగు, కొంచెం జీలకర్ర పొడి, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.

Jack Fruit Biryani Recipe in telugu

Jack Fruit Biryani Recipe in telugu

తర్వాత దానిలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసి వేయించుకొని తర్వాత దాన్ని దింపి పక్కన ఉంచుకొని ఒక స్టవ్ పై గిన్నెలో వాటర్ పెట్టి దానిలో బిర్యానీ దినుసులు వేసి రైస్ వేసి 80% ఉడికించుకొని ముందుగా చేసి పెట్టుకున్న పనస కూరలో సగం తీసి పక్కన ఉంచి మిగతా దాన్లో రెండు లేయర్ల వరకు రైస్ ని వేసి దానిపైన కొత్తిమీర కొంచెం పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్ని వేసి మళ్లీ ఆ కూర కూడా వేసి మళ్లీ పైన రైస్ వేసి కొత్తిమీర, పుదీనా, ఆనియన్ మళ్ళీ వేసి, కుంకుమపువ్వు నీళ్లను కూడా వేసి మూత పెట్టి స్టవ్ పైన ఇనప పెనం పైన ఈ గిన్నెను పెట్టి దమ్ బిర్యాని లాగా దమ్ చేసుకోవాలి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆపిన తర్వాత పది నిమిషాలు ఉంచి తీసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా పనస దమ్ బిర్యాని రెడీ.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది