
jagapathibabu eats highway food with his assistants photo viral
Jagapathi Babu : తెలుగులో ఫ్యామిలీ హీరో ఎవ్వరు అని అడిగితే టక్కున వచ్చే సమాధానం జగపతి బాబు. ఆయన్ను అందరూ ముద్దుగా జగ్గూ భాయ్ అని పిలుస్తుంటారు. టాలీవుడ్ లో జగ్గూ భాయ్ కి ఉన్న ఫాలోయింగే వేరు. ప్రస్తుతం తన సెకండ్ కెరీర్ లో జోరు పెంచి.. చేతినిండా సినిమాలు చేస్తున్నారు జగపతి బాబు. ప్రస్తుతం ఏ సినిమాలో అయినా సరే.. సెకండ్ లీడ్ క్యారెక్టర్ కోసం ఖచ్చితంగా జగపతిబాబు వైపే చూస్తున్నారు దర్శకనిర్మాతలు. హీరో తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు అయినా.. విలనిజం పండించే పాత్రలు అయినా.. వినోదం పండించే పాత్రలు అయినా అవలీలగా చేసేంత దమ్మున్న నటుడు జగపతి బాబు.
jagapathibabu eats highway food with his assistants photo viral
హీరోగా చాలా సినిమాలు తీసిన తర్వాత.. ఒకానొక సమయంలో జగపతి బాబు హీరోగా ఫెయిల్ అయ్యారు. అప్పుడు చాలా సమస్యల్లో చిక్కుకున్నారు. ఆఫర్లు కూడా రాలేదు. కానీ.. తర్వాత విలన్ క్యారెక్టర్ వేసి.. తనలోని అసలు నటుడిని బయటపెట్టాడు జగపతి బాబు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. స్టార్ హీరోలకు దీటుగా నటిస్తూ.. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు.
జగపతి బాబు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా తన అసిస్టెంట్లతో కలిసి ఓ హైవే దాబాలో సాదాసీదాగా లంచ్ చేస్తున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు జగ్గూ భాయ్. చాలా రోజుల తర్వాత నా అసిస్టెంట్ చిరు, డ్రైవర్ రాజుతో కలిసి హైవే దాబాలో లంచ్ చేశా. చాలా బాగా అనిపించింది.. అంటూ జగ్గూ భాయ్ క్యాప్షన్ కూడా పెట్టారు.
ఇక.. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు, జగ్గూ భాయ్ అభిమానులు.. ఆ ఫోటోను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో ఉండి.. స్టార్ హోదాను అనుభవిస్తూ.. ఇంత సాదాసీదాగా ఉండే వ్యక్తిని మాత్రం ఎప్పుడూ చూడలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అది ఒక చిన్న దాబా. అక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు తినరు. అసలు అక్కడ అడుగు కూడా పెట్టరు. కానీ.. జగపతి బాబు మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. తన కారు డ్రైవర్ తో, అసిస్టెంట్ తో కూర్చొని తినడం అనేది నిజంగా ఆయన సింప్లిసిటీకి నిదర్శనం.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.