YSRCP రాజకీయాల్లో విభేదాలు.. వివాదాలు.. విమర్శలు అన్నీ కామనే. అయితే.. ఇవన్నీ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల మధ్య అయితే.. కామన్ అనుకోవచ్చు. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీలో అందులోనూ నెల్లూరు జిల్లాలో ఈ వివాదాలు .. ముదిరి పాకాన పడ్డాయని టాక్ వినిపిస్తోంది. జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి అనిల్ కుమార్‌కు, మేధావిగా పేరున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య వివాదం చెలరేగింది. మట్టి తినేస్తున్నారని ఒకరు, ఇసుక దోచేస్తున్నారని మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం రాజకీయంగా ఇద్దరినీ.. తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది.
సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమంగా మట్టి తవ్వకాలు.. నెల్లూరు శివార్లలోని పెన్నానదిలో ఇసుక అక్రమ తరలింపులపై అనిల్‌కుమార్, కాకాని గోవర్థన్ రెడ్డిల మధ్య రెండేళ్లుగా నడుస్తున్న వైరం ముదిరిపాకాన పడింది.. తాజాగా ఈ పంచాయితీ పార్టీ అధిష్ఠానం దృష్టికి చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలకు అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులకు ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇచ్చింది. 8 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతిస్తూ సినరీసెజ్ కూడా కట్టించుకున్నారు. అయితే అనుమతులకు మించి ఇక్కడ మట్టి తవ్వకాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయాల్లో కూడా ఇక్కడ నుంచి మట్టిని తరలిస్తున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారించాలని మంత్రి అనిల్ కుమార్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇదే వివాదానికి దారితీసిందని అంటున్నారు పరిశీలకులు. వెనువెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి, అనిల్ కుమార్ ఆధ్వర్యంలోని పెన్నాలో ఇసుక తవ్వకాలు అక్రమంగా సాగుతున్నాయంటూ.. అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఇరు పక్షాల మధ్య తవ్వకాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సమస్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరకు చేరిందని.. త్వరలోనే వైఎస్.జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. అయితే .. కొద్దిరోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం చర్చనీయాంశంగా మారాయి. జిల్లా కేడర్ లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారిందని సమాచారం.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.