Jagapathi Babu : చిన్న దాబాలో తన డ్రైవర్ తో జగ్గూభాయ్ లంచ్.. మరీ ఇంత సింప్లిసిటీనా.. వైరల్ ఫోటో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jagapathi Babu : చిన్న దాబాలో తన డ్రైవర్ తో జగ్గూభాయ్ లంచ్.. మరీ ఇంత సింప్లిసిటీనా.. వైరల్ ఫోటో

Jagapathi Babu : తెలుగులో ఫ్యామిలీ హీరో ఎవ్వరు అని అడిగితే టక్కున వచ్చే సమాధానం జగపతి బాబు. ఆయన్ను అందరూ ముద్దుగా జగ్గూ భాయ్ అని పిలుస్తుంటారు. టాలీవుడ్ లో జగ్గూ భాయ్ కి ఉన్న ఫాలోయింగే వేరు. ప్రస్తుతం తన సెకండ్ కెరీర్ లో జోరు పెంచి.. చేతినిండా సినిమాలు చేస్తున్నారు జగపతి బాబు. ప్రస్తుతం ఏ సినిమాలో అయినా సరే.. సెకండ్ లీడ్ క్యారెక్టర్ కోసం ఖచ్చితంగా జగపతిబాబు వైపే చూస్తున్నారు దర్శకనిర్మాతలు. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 July 2021,10:00 pm

Jagapathi Babu : తెలుగులో ఫ్యామిలీ హీరో ఎవ్వరు అని అడిగితే టక్కున వచ్చే సమాధానం జగపతి బాబు. ఆయన్ను అందరూ ముద్దుగా జగ్గూ భాయ్ అని పిలుస్తుంటారు. టాలీవుడ్ లో జగ్గూ భాయ్ కి ఉన్న ఫాలోయింగే వేరు. ప్రస్తుతం తన సెకండ్ కెరీర్ లో జోరు పెంచి.. చేతినిండా సినిమాలు చేస్తున్నారు జగపతి బాబు. ప్రస్తుతం ఏ సినిమాలో అయినా సరే.. సెకండ్ లీడ్ క్యారెక్టర్ కోసం ఖచ్చితంగా జగపతిబాబు వైపే చూస్తున్నారు దర్శకనిర్మాతలు. హీరో తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు అయినా.. విలనిజం పండించే పాత్రలు అయినా.. వినోదం పండించే పాత్రలు అయినా అవలీలగా చేసేంత దమ్మున్న నటుడు జగపతి బాబు.

jagapathibabu eats highway food with his assistants photo viral

jagapathibabu eats highway food with his assistants photo viral

హీరోగా చాలా సినిమాలు తీసిన తర్వాత.. ఒకానొక సమయంలో జగపతి బాబు హీరోగా ఫెయిల్ అయ్యారు. అప్పుడు చాలా సమస్యల్లో చిక్కుకున్నారు. ఆఫర్లు కూడా రాలేదు. కానీ.. తర్వాత విలన్ క్యారెక్టర్ వేసి.. తనలోని అసలు నటుడిని బయటపెట్టాడు జగపతి బాబు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. స్టార్ హీరోలకు దీటుగా నటిస్తూ.. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు.

Jagapathi Babu : సాదాసీదాగా లంచ్ చేస్తున్న జగ్గూ భాయ్ ఫోటో వైరల్

జగపతి బాబు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా తన అసిస్టెంట్లతో కలిసి ఓ హైవే దాబాలో సాదాసీదాగా లంచ్ చేస్తున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు జగ్గూ భాయ్. చాలా రోజుల తర్వాత నా అసిస్టెంట్ చిరు, డ్రైవర్ రాజుతో కలిసి హైవే దాబాలో లంచ్ చేశా. చాలా బాగా అనిపించింది.. అంటూ జగ్గూ భాయ్ క్యాప్షన్ కూడా పెట్టారు.

ఇక.. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు, జగ్గూ భాయ్ అభిమానులు.. ఆ ఫోటోను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో ఉండి.. స్టార్ హోదాను అనుభవిస్తూ.. ఇంత సాదాసీదాగా ఉండే వ్యక్తిని మాత్రం ఎప్పుడూ చూడలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అది ఒక చిన్న దాబా. అక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు తినరు. అసలు అక్కడ అడుగు కూడా పెట్టరు. కానీ.. జగపతి బాబు మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. తన కారు డ్రైవర్ తో, అసిస్టెంట్ తో కూర్చొని తినడం అనేది నిజంగా ఆయన సింప్లిసిటీకి నిదర్శనం.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది