KCR – Jagga Reddy : తెలంగాణ మొత్తం వేడెక్కిన రాజకీయం – జగ్గారెడ్డి తో కేసీఆర్ భేటీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR – Jagga Reddy : తెలంగాణ మొత్తం వేడెక్కిన రాజకీయం – జగ్గారెడ్డి తో కేసీఆర్ భేటీ !

 Authored By kranthi | The Telugu News | Updated on :10 February 2023,7:20 pm

KCR – Jagga Reddy : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు తిరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఎందుకంటే.. రాజకీయాలు అంటేనే అలా ఉంటాయి. నిజానికి తెలంగాణ రాజకీయాలు మాత్రమే కాదు.. ఏ రాజకీయాలు అయినా అంతే. ఏ రాష్ట్రంలో అయినా అంతే. రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోతుంటాయి. అందులో తెలంగాణ కూడా ఒకటి అనుకోండి. నిజానికి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. దానికి కారణం.. బీఆర్ఎస్ పార్టీ. ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ దేశరాజకీయాల మీద పడటంతో అందరూ ఇప్పుడు ఈ పార్టీ గురించే చర్చిస్తున్నారు. తాజాగా.. కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి..

Jagga Reddy meets telangana cm kcr

Jagga Reddy meets telangana cm kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆయన కేసీఆర్ తో తెలంగాణ అసెంబ్లీ హాల్ లో భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జగ్గారెడ్డి, కేసీఆర్ ఇద్దరూ మాట్లాడారు. జగ్గారెడ్డి, కేసీఆర్ ఇద్దరూ మాత్రమే మాట్లాడుకున్నారట. ఆసమయంలో ఎవ్వరూ లేరట.అయితే.. వీళ్లిద్దరూ అంత సీక్రెట్ గా ఏం మాట్లాడుకున్నారు అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి.. జగ్గారెడ్డి కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీపై అసహనంతో ఉన్నారు. ఈనేపథ్యంలోనే జగ్గారెడ్డి భేటీ జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. గత కొన్నాళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉండి..

Jagga Reddy meets telangana cm kcr

Jagga Reddy meets telangana cm kcr

KCR – Jagga Reddy : అంత సీక్రెట్ గా ఏం మాట్లాడుకున్నారు?

సమయం దొరికితే వేరే పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్న ఈరోజుల్లో జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ భేటీ తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించింది. అయితే.. తన నియోజకవర్గ అభివృద్ధి గురించే మాట్లాడేందుకు కేసీఆర్ ను కలిశానని జగ్గారెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఇంకా మాట్లాడే అంశాలు చాలా ఉన్నాయని.. ప్రగతి భవన్ కు వచ్చి మిగితా విషయాలు చెబుతా అని చెప్పానని మీడియా ముందు చెప్పారు. మరి.. జగ్గారెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది