Janaki Kalaganaledu 20 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ 20 ఆగస్టు 2021, శుక్రవారం ఎపిసోడ్ 110 తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానాంబ ఇద్దరినీ.. రామా, జానకిని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెబుతుంది. అదే మీకు నేను వేసే శిక్ష అని చెబుతుంది జ్ఞానాంబ. ఈ అమ్మ మాటంటే విలువ లేని కొడుకు, గౌరవం లేని కోడలు నా కళ్ల ముందు ఉండకూడదు. ఈ ఇంట్లో ఉండకూడదు. అని అంటుంది జ్ఞానాంబ. తెలియక చేస్తే పొరపాటు కానీ.. వాళ్లు తెలిసి చేశారు. అది మోసం. వాళ్ల మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేశారు. ఈరోజు భార్య కోసం నా కొడుకు నా మాట దాటి ప్రవర్తించాడు. రేపటి రోజు ఇంకేదైనా విషయంలో వీడు ఇలాగే చేస్తాడు. భార్య కోసం నాకు చెప్పకుండా.. ఖచ్చితంగా నాదగ్గర దాచిపెడతాడు కూడా.
ఆ రోజు ఆ బాధను భరించడం నా వల్ల కాదు. అందుకే.. నాకొడుకును నేను గుడ్డిగా నమ్మి మరోసారి మోసపోకూడదు. మరోసారి బాధపడకూడదు. అందుకే.. వీళ్లను ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెబుతున్నాను. దయచేసి ఈ విషయంలో ఇంకో మాట మాట్లాడకండి.. అని తన భర్తను వారిస్తుంది.
అమ్మ.. ప్రాణం లేకుండానైనా బతకుతానేమో కానీ.. మా అమ్మ లేకుండా బతకలేను. మరి.. మా అమ్మను వదిలిపెట్టి నేను ఎలా బతకగలను అమ్మా. వెళ్లి బతకగలనా? అసలు వెళ్లగలనా? అమ్మా.. మా అమ్మను చూడకుండా ఉండటం అంటే అది నా ప్రాణం పోయాకనే.. అని రామా అంటాడు.
ఈ అమ్మ అంటే అంత ప్రేమ ఉన్నవాడివే అయితే… నా మాటను కాదనప్పుడే నీ ప్రాణం పోవాలి కదరా.. ఇప్పుడు గుమ్మం దాటడం కూడా అంతే.. అని జ్ఞానాంబ అంటుంది.
అమ్మా.. ఒక్కసారి నామాట వినండి.. అని అంటాడు రామా. మీరు ఇక్కడే ఉండి.. నన్ను ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. అని జ్ఞానాంబ సీరియస్ అవుతుంది.
దీంతో.. ఏం చేసేది లేక.. రామా, జానకి.. ఇద్దరూ సూట్ కేసులు తీసుకొని.. బయటకి వెళ్తుంటారు. బ్యాక్ గ్రౌండ్ లో పాట వస్తుంటుంది. తల్లి, బిడ్డల అనుబంధానికి సంబంధించిన పాట ప్లే అవుతుంది. జ్ఞానాంబ కూడా మనసులో తీవ్రంగా బాధపడుతుంటుంది.
వాళ్లిద్దరు గుమ్మం దాటుతుండగానే.. అందరూ అలాగే నిలబడి చూస్తారు. కట్ చేస్తే.. జానకి ఖార్ఖానాలో నిద్రపోయి కలగంటుంది. ఖార్ఖానాలోనే జానకి.. పడుకొని.. అత్తయ్య మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించినట్టు కలగంటుంది. వెంటనే ఉలిక్కి పడి లేచి.. భయపడుతుంది. కల వచ్చిందండి. అత్తయ్య గారు మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసినట్టు కల వచ్చిందండి. తెల్లవారుజామున కలలు నిజం అవుతాయి అంటారు. అయినా కల రావడం కాదు.. జరగబోయేది అదేనేమోనని భయంగా ఉందండి.. అంటుంది జానకి.
జానకి గారు.. కొన్ని నిజాలను మనం దాచగలం. కానీ.. కొన్ని నిజాలను అస్సలు దాచలేం. ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుంది. మిమ్మల్ని నేను చదివిస్తున్న విషయం అమ్మకు తెలిస్తే.. ఏమౌతుందో ముందు తెలుసు. దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. అని అంటాడు రామా. నాకు ఏమైనా పర్వాలేదు కానీ.. నా కోసం మీరు ఇలా ఇబ్బందులు పడటం నాకు నచ్చడం లేదండి.. అంటుంది జానకి. నేను, మీరు కాదు.. మనం. తెల్లారింది కదా. అమ్మ మనకోసం ఎదురుచూస్తుంటుంది. వెళ్దాం పదా.. అంటాడు రామా.
కట్ చేస్తే.. మల్లిక తెగ సంబుర పడుతూ.. డ్యాన్స్ చేస్తుంటుంది. తనను తానే మరిచిపోయి.. తెగ డ్యాన్స్ చేస్తుంది. తన భర్త వచ్చినా కూడా ఆగకుండా… డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఆగవే.. అని అన్నా కూడా అస్సలు ఆగదు మల్లిక.
మీ అమ్మ.. మీ అన్న, వదిన రాగానే.. ఆగండి. ఆవేశంతో వచ్చి వాళ్ల దగ్గరికి సీరియస్ గా వచ్చి చూసి.. నా కొడుకు నాకు చెప్పకుండా నా మాటను కాదని.. నన్ను ఇలా చేశావు కదరా.. అంటూ పులిలా గర్జిస్తుంది. నువ్వు నన్ను అమ్మా అని పిలిచే హక్కును కోల్పోయావు. అమ్మ నమ్మకాన్ని మోసం చేశావు. బయటికి వెళ్లు.. అంటూ పెదరాయుడు స్టయిల్ లో స్పీచ్ ఇస్తుంది. దాంతో మీ అన్నయ్య, వదిన ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు.. అంటూ తెగ ఖుషీ అవుతుంది మల్లిక.
కట్ చేస్తే.. జ్ఞానాంబ అన్ని విషయాలను గుర్తు తెచ్చుకుంటుంది. రామా, జానకి కాలేజీకి వెళ్లారా? లేక ఇంకెక్కడికి వెళ్లారు? అని ఆలోచిస్తుంటుంది జ్ఞానాంబ. అసలు.. వాళ్లు కాలేజీకి ఎందుకు వెళ్లారో తనకు అర్థం కాదు? జ్ఞానాంబ రాత్రి నుంచి నిద్రపోకుండా ఇలాగే కూర్చున్నావు.. లోపలికి పదా.. అని తన భర్త అంటాడు. చెప్తుంటే వినవు ఏంటి జ్ఞానాంబ.. లోపలికి పదా.. అంటాడు తన భర్త.
ఇంతలోనే జానకి, రామా.. ఇద్దరూ బైక్ మీద ఇంటికి వస్తారు. ఒరేయ్.. బుద్ధుందా మీకు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే.. మీ అమ్మతో చెప్పి వెళ్లొచ్చు కదా. అంతా సొంత పెత్తనమా? అంటూ జ్ఞానాంబ భర్త రామాను తిడుతాడు. అయినా.. మీ అమ్మ నిర్ణయాన్ని దాటి ప్రవర్తించడం తప్పు అని తెలిసి కూడా ఇలా చేస్తారా? అంటుండగానే.. జ్ఞానాంబ మీరు కాసేపు ఏం మాట్లాడకండి.. అని తన భర్తను బెదిరిస్తుంది.
రామా… నువ్వు జానకిని తీసుకొని.. పట్నంలోని కాలేజీకి వెళ్లావా? అంటూ సూటిగా ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ. అడుగుతుంది నిన్నే.. నువ్వు జానకిని కాలేజీకి తీసుకెళ్లావా? తీసుకెళ్లావా? లేదా? చెప్పు.. అని అడుగుతుంది. దీంతో తీసుకెళ్లాను.. అమ్మా అని చెబుతాడు రామా. అంటే.. జానకి చదివింది ఐదో తరగతి కాదా? కాలేజీలో చదువుకుందా? తన చదువును దాచిపెట్టి అబద్ధం చెప్పారా? మాట్లాడరు ఏంటి? అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ.
లేదమ్మా.. తను చదివింది ఐదో తరగతే అంటాడు రామా. మరి.. తనను కాలేజీకి ఎందుకు తీసుకెళ్లావు. తనకు కాలేజీలో ఏం పని.. సమాధానం చెప్పు. ఎందుకు తీసుకెళ్లావు.. అని జ్ఞానాంబ గట్టిగానే అడుగుతుంది. దీంతో.. అమ్మా.. అది జానకి గారిని తీసుకెళ్లింది కాలేజీకి కాదమ్మా. కాలేజీ పక్కనున్న గుడికి.. అని అబద్ధం చెబుతాడు రామా.
గుడికా.. అని అడుగుతుంది. నిన్న జానకి గారి వాళ్ల నాన్న పుట్టిన రోజు. ఆ ఊరి గుడిలో వాళ్ల నాన్న పేరు మీద పూజ చేయించాలని జానకి ఎప్పుడో మొక్కుకుందట. అందుకే తనను అక్కడికి తీసుకెళ్లా.. అంటాడు రామా. ఇదంతా కట్టుకథలా ఉందే.. అని మల్లిక అనుకుంటుంది.
అందుకే మేము ఆ గుడికి వెళ్లాం అమ్మా.. అని అంటాడు రామా. గుడికి వెళ్లిన వాళ్లకు కాలేజీకి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంటూ మల్లిక అడుగుతుంది. దీంతో జ్ఞానాంబ చెప్పండి. గుడికి వెళ్లిన వాళ్లు కాలేజీకి ఎందుకు వెళ్లినట్టు.. అని అడిగింది జ్ఞానాంబ. దీంతో పక్కనే జనాలు ఎక్కువగా ఉంటే.. ఏంటో చూద్దాం అని వెళ్లాం అని చెప్తాడు రామా.
జానకి.. అంటూ తనకు ఏదో చెప్పబోయిన జ్ఞానాంబ.. ఇంట్లోకి వెళ్లి ఒక తాంబాలం తీసుకొని వస్తుంది. దాని మీద ఒక వస్త్రం కప్పి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి జ్ఞానాంబ ఏదో చెప్పబోతుంది. అంతలోనే సీరియల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం సోమవారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.