మోదీ అంటేనే గజగజ వణికిపోతున్న పవన్ కళ్యాణ్? కారణం ఇదేనా?
నేను ఎక్కడో పుట్టలేదు. రైతు కుటుంబంలోనే పుట్టా. రైతుల బాధలు నాకు తెలుసు. రైతుల కష్టాలు తెలుసు. అందుకే నేను జైకిసాన్ అనే ఉద్యమాన్న ప్రారంభిస్తున్నా.. అంటూ పవన్ కళ్యాణ్.. ఇటీవల నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు చెప్పిన మాట.

janasena chief pawan kalyan about pm modi
అవును.. నేడు మన దేశంలో రైతులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. రైతుల కోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా చివరకు రైతులకు ఎటువంటి ఫలితం దక్కడం లేదు.
అయితే.. ఇటీవల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని.. నివర్ తుపాను బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ వ్యాఖ్యానించారు. కేవలం ఏపీ ప్రభుత్వాన్ని మాత్రమే ఆయన టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు.
ఆయన పర్యటన కూడా నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగింది. అక్కడ రైతులతో చాలా భావోద్వేగంతో మాట్లాడారు. రైతుల కష్టాలను తీర్చాలంటూ ప్రభుత్వాన్ని అడిగారు.
సరే.. రైతులు రైతులే. ఎక్కడి రైతులైనా పండించేది పంటే. వాళ్లు పండిస్తేనే నాలుగు వేళ్లు మన నోట్లోకి వెళ్తాయి. మరి.. ఏపీ రైతుల గురించి అంతగా ఆలోచించిన పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న హర్యానా, పంజాబ్ రైతులు కనిపించలేదా? అంటూ ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. వాళ్లు రైతుల్లా పవన్ కు కనిపించడం లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడని పవన్ కళ్యాణ్
అసలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విషయం గురించి కూడా మాట్లాడటానికి పవన్ సమ్మతించడం లేదు. ఇటీవల నివర్ తుపాన్ పర్యటన సమయంలోనూ ఓ విలేఖరి.. హర్యానా రైతుల నిరసన గురించి పవన్ ను ప్రశ్నించినా పవన్ దాటవేత సమాధానం ఇచ్చారు తప్పితే.. దానిపై స్పందించలేదు. ఏపీ రైతుల గురించే ఆలోచిస్తున్న పవన్.. దేశంలోని మిగితా రైతుల బాధలను కూడా పట్టించుకుంటే మంచిదే కదా.. అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అయితే సీఎం జగన్ ను ప్రశ్నించే పవన్.. ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీని ప్రశ్నించడం లేదు. ఎవరైనా రైతులే కదా. మోదీ అంటే ఎందుకు పవన్ అంతలా భయపడుతున్నారు? కారణం ఏంటి?… అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ వేత్తలు ప్రశ్నిస్తున్నారు.