
janasena leaders and fans response Pawan Kalyan rs 160 crs farm house
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ గండి పేట సమీపంలో 160 కోట్ల రూపాయలతో భారీ ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నాడని.. హైదరాబాదు లోనే అత్యంత ఖరీదైన ఫార్మ్ హౌస్ గా నిలిచింది అంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటూ పదే పదే చెప్పి పవన్ కళ్యాణ్ కి ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ జనసేన పార్టీకి వ్యతిరేక పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పార్టీ పేరు చెప్పి భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు అంటూ ఆయన వ్యతిరేక ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలు మరియు ఫామ్ హౌస్ గురించి జరుగుతున్న ప్రచారంపై జనసేన కార్యకర్తలు స్పందిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గండిపేట సమీపంలో 16 ఎకరాల భూమిని దాదాపుగా 10 నుండి 15 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశాడు. ఆ సమయంలో భూముల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దాని రేటు 160 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ కొత్తగా 160 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయలేదని జనసేన నాయకులు చెబుతున్నారు.
janasena leaders and fans response Pawan Kalyan rs 160 crs farm house
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అక్కడ పది కోట్లు ఖర్చు చేసి ఒక ఇల్లు ని నిర్మించిన మాత్రాన మొత్తం 160 కోట్లు ఖర్చు చేయడం లేదు అనేది విషయం జనసేన నాయకులు మరియు కార్యకర్తలు చెబుతున్న విషయం. పవన్ కళ్యాణ్ కు వందల కోట్ల ఆస్తులు ఉన్న మాట వాస్తవం కాదని.. గతంలో తనకు వ్యవసాయం పై ఉన్న ఆసక్తితో ఆ భూమిని కొనుగోలు చేస్తే అది కాస్త ఎక్కువ రేటు వచ్చిందని పవన్ అభిమానులు కూడా అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత అనేది త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.