Mytri movie makers about Bunny 125 crore remuneration for Pushpa 2
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ లో సాధించిన వంద కోట్లతో కలిపి మొత్తంగా దాదాపుగా 350 కోట్ల రూపాయల వరకు పుష్ప సినిమా రాబట్టింది అనేది ఇండస్ట్రీ బాక్సాఫీస్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. పుష్ప 1 ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో సహజంగానే పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా పుష్ప 2 ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సుకుమార్ చాలా సమయం తీసుకుని మరీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.
ఈ సమయంలో పుష్ప 2 కు అల్లు అర్జున్ పారితోషికం 125 కోట్లు అంటూ ప్రచారం మొదలు అయ్యింది. పుష్ప 1 సినిమా కు గాను బన్నీ 40 కోట్ల పారితోషికం తీసుకుని లాభాల నుండి వాటాను తీసుకున్నాడ. దాంతో బన్నీకి పుష్ప 1 ద్వారా దాదాపుగా 60 కోట్ల వరకు వచ్చి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా లో పారితోషికం ఉంటుంది. అంటే 40 నుండి 50 కోట్ల వరకు పారితోషికం గా తీసుకుని ఆ తర్వాత లాభాల్లో వాటాగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప 125 కోట్ల పారితోషికం అనేది ఏమాత్రం నిజం కాదని మైత్రి వర్గాల వారి ద్వారా మాకు సమాచారం అందింది.
Mytri movie makers about Bunny 125 crore remuneration for Pushpa 2
ఇప్పటి వరకు పుష్ప 2 కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాలేదు.. ఈ సమయంలో ఆయన పారితోషికం గురించి మీడియాలో వార్తలు రావడం విడ్డూరంగా ఉందంటూ మైత్రి వారు అంటున్నారు. సినిమా మొదట్లోనే పుష్ప పారితోషికం గురించి మాట్లాడుకోవడం జరిగింది. పుష్ప 1 హిట్ అయ్యిందని.. 2 కు భారీ పారితోషికం ఇవ్వడం ఉండదు. లాభాల్లో వాటా మరియు నామినల్ రెమ్యూనరేషన్ మాత్రమే అల్లు అర్జున్ పుష్ప 2 కి కూడా తీసుకోబోతున్నాడు అంటూ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ కు చెందిన వారు అనధికారికంగా చెప్పారు. ఇదే సమయంలో పుష్ప 2 షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు క్లారిటీ ఇచ్చారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.