Amalapuram : అమలాపురం అల్లర్లలో రాజకీయ కోణం ఉంది
Amalapuram : కోనసీమలో జరిగిన అల్లర్ల కేసు దర్యాప్తు వేగవంతం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కోనసీమ అల్లర్ల కేసులో పదుల కొద్ది నింధితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో తెలుగు దేశం పార్టీకి చెందిన కార్యకర్తలు మరియు జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఉన్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా రంగు పులుముకుని రచ్చ జరిగిందంటూ ప్రభుత్వ వర్గాల వారు మరియు పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా పై రాజకీయ కోపంతోనే తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వంను ఇరకాటంలో పెట్టడం ద్వారా ప్రజల్లో చెడ్డ పేరును తెచ్చే విధంగా వైకాపా మరియు తెలుగు దేశం పార్టీ లు అమలాపురం అల్లర్లకు ఆజ్యం పోసి ఉంటారు అంటూ మొదటి నుండి కొందరు వైకాపా నాయకులు అనుమానాం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అరెస్ట్ అయిన వారిని విచారించగా ఆ విషయం నిజమేనేమో అనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన కోనసీమ అల్లర్లకు రాజకీయ కోణం ఉండటం బాధాకరం. రాష్ట్రం పరువు తీసే విధంగా రాజకీయం చేసి ఇలా వ్యవహరించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుండి కోనసీమ అల్లర్లకు సందేశాలు.. సలహాలు అందాయి అంటూ పోలీసుల విచారణ లో తేలిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ కోణం ఉండటంతో కోనసీమ అల్లర్లు అంతగా జరిగాయి అంటూ వైకాపా నాయకులు అంటున్నారు. వైకాపా కు చెందిన ముఖ్య నాయకులను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అల్లర్లను అడ్డు పెట్టుకుంటున్నారు అంటూ కోనసీమ కు చెందిన కొందరు వైకాపా నాయకులు ఆగ్రహంతో ఊగి పోతున్నారు. జనసేన మరియు టీడీపీ లకు వచ్చే ఎన్నికల్లో కోనసీమ ప్రజలు బుద్ది చెప్తారు అంటూ వైకాపా ఆశా భావం వ్యక్తం చేస్తోంది.