BJP : టీడీపీతో పొత్తుకు బీజేపీ నాట్ ఇంట్రెస్టెడ్… జగన్ తో వెళ్తేనే మంచిది
BJP : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల గడువు ఉంది. ఆయినా కూడా ఇప్పటి నుండే రాజకీయ వేడి రాజుకుంటోంది. కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ బిజెపి రోడ్డు మ్యాపు తో వస్తే కచ్చితంగా దాన్ని ఫాలో అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తే.. బీజేపీతో పొత్తుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నమని జనసేన క్లారిటీగా చెప్పేసింది. మరో వైపు తెలుగు దేశం పార్టీతో కూడా పొత్తు కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
గతంలో మాదిరిగా ఓట్లను చీల్చే ఉద్దేశం లేదని ప్రకటించాడు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి తీసుకు రావడం కోసం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చడం ద్వారా చంద్రబాబు నాయుడు కు కలిసి వచ్చేలా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ నిర్ణయం వర్కవుట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక చోట తప్పితే ఆయన పార్టీ ఎక్కడా గెలవలేదు.
తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవాన్ని చవి చూసిన జగన్ ప్రభుత్వం ఆవిర్భవించింది. జగన్ ప్రభుత్వం కేవలం మూడు సంవత్సరాల్లోనే అద్బుతాన్ని ఆవిష్కరించారు. ఎన్నో కార్యక్రమాలను మొదలు పెట్టి అభివృద్ది చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది కార్యక్రమాల జోరు చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల నాయకులు మరియు ప్రజలు కూడా ఏపీ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. జగన్ మరో సారి మాత్రమే కాదు వరుసగా మూడు నాలుగు సార్లు సీఎంగా అవుతాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.