Pawan Kalyan : పవన్ కళ్యాణ్ డౌట్ గా ఫీల్ అవుతున్నాడు… మోదీతో వెళ్లాలా వద్దా..!
Pawan Kalyan : ఇన్నిరోజులు ఒక లెక్క.. ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్టుగా ఎప్పుడైతే ప్రధాని మోదీ.. పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారో.. అప్పటి నుంచి పవన్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీతో పోటీ పడి మరీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వైసీపీపై ఎదురు దాడి చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగానూ జనసేన పార్టీ హైలైట్ అవుతోంది. అయితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం కొన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి పని చేస్తోంది. అందులో జనసేన కూడా ఒకటి. జనసేన పార్టీ బీజేపీతో ఇప్పటికే పొత్తు పెట్టుకుంది.
కానీ.. ఇన్ని రోజులు అసలు ఆ పొత్తు ఉందా? లేదా? అన్నట్టుగా ఉండేది. అసలు పార్టీనే బీజేపీలో విలీనం చేయండి అంటూ పవన్ ను బీజేపీ నేతలు కోరారు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం తన పార్టీని బీజేపీలో విలీనం చేయలేదు కానీ.. పొత్తు మాత్రం కొనసాగిస్తున్నాడు. 2020 లో బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తును ప్రకటించారు. అందులోనూ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో పవన్ కూడా పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. బీజేపీతో కలిసి పవన్ అడుగు వేసింది అయితే లేదు. జనసేన పార్టీకి మద్దతుగా బీజేపీ శ్రేణులు ఎప్పుడూ వచ్చింది లేదు. ఓవైపు పొత్తు ఉన్నప్పటికీ బీజేపీ నేతలు.. జనసేనతో పొత్తు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు.
Pawan Kalyan : జనసైనికులు ప్రశ్నిస్తుండటంతో పునరాలోచనలో పడ్డ పవన్
దీంతో అసలు బీజేపీతో పొత్తు అవసరమా అన్నట్టుగా జనసైనికులు పవన్ ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రధానిని పవన్ కళ్యాణ్ కలిసినా కూడా పొత్తుపై ఎలాంటి చర్చ వీళ్ల మధ్య రానట్టు తెలుస్తోంది. దీంతో పొత్తు విషయంలో పునరాలోచన చేయాలంటూ జనసేన శ్రేణులు పవన్ ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అసలు తను ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఆ లక్ష్యం అయినా చివరకు నెరవేరిందా? అనే మీమాంసలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం.. ఇంకొంత కాలం వేచి చూశాక పొత్తు విషయంపై ఒక క్లారిటీ వస్తుందని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.