KCR : కేసీఆర్ కు షాక్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు?
KCR : గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మీద, సీఎం కేసీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ పై సొంత పార్టీ నేతలే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బాహటంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. అయితే.. బహిరంగంగానే టీఆర్ఎస్ పార్టీపై తమ అసంతృప్తిని వెల్లగక్కారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అదే పని చేశారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. తాజాగా తన అసంతృప్తిని బయటపెట్టారు. పార్టీపై, సీఎం కేసీఆర్ పై ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సీనియర్ గా ఉన్నా కూడా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని.. తన తర్వాత పార్టీలోకి వచ్చిన చాలామంది నేతలకు మంత్రి పదవులు దక్కాయని వాపోయారు.
పార్టీ కార్యకర్తల ముందే ఓ సమావేశం జరుగుతుండగా.. ప్రసంగించిన ముత్తిరెడ్డి ఈ సందర్భంగా తన అసంతృప్తిని బయటపెట్టారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముత్తిరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నమొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయి. అయినా కూడా నాకు బాధ లేదు. నాకు మంత్ర పదవి దక్కకున్నా.. సీఎం కేసీఆర్ కు, పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నా. నమ్మకంగా పని చేస్తున్నా. అలాగే.. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ఏది చెబితే అదే చేస్తా.. అంటూ ముత్తిరెడ్డి అన్నారు.
KCR : ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనం
ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా ప్రకంపనం సృష్టించింది. టీఆర్ఎస్ లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది. తనకన్నా వెనకకు వచ్చిన వాళ్లకు మంత్రి పదవి వచ్చింది అంటే.. తనకంటే వెనుక పార్టీలోకి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు గురించే ముత్తిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది.
తనకంటే వెనక వచ్చి పార్టీలో చేరి.. మంత్రి పదవి పొంది.. ఇప్పుడు జనగామ జిల్లాలో ఎర్రబెల్లి పెత్తనం చెలాయిస్తున్నారని.. ముత్తిరెడ్డి ఆవేదన చెందుతున్నారు. అందుకే.. ముత్తిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.