JC Diwakar Reddy : జేసీ దివాకరరెడ్డి ఖేల్ ఖతం? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు?

Advertisement

Jc diwakar Reddy : జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ బ్యాలన్స్ తప్పి మాట్లాడుతుంటారు. జేసీ దివాకరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తారు. ఇప్పుడు జేసీ దివాకరరెడ్డి కుటుంబం అధికారానికి దూరమయింది. పార్టీ కూడా వారిని దూరం పెట్టింది. దీంతో జేసీ దివాకర్ రెడ్డి లో వైరాగ్యం కన్పిస్తుంది. సమాజం, రాజకీయం అంతా చెడిపోయిందంటూ వేదాంత ధోరణికి వచ్చేశారు. దశాబ్దాల కాలాల నుంచి జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలు వెలగపెడుతున్నారు.

Advertisement
Jc diwakar Reddy comments on ycp
Jc diwakar Reddy comments on ycp

Jc diwakar Reddy : జేసీ దివాకరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లినట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పుడు రాజకీయం ఏమాత్రం బాగా లేదంటున్నారు. సమాజం కూడా పూర్తిగా చెడిపోయిందన్న ధోరణికి వచ్చేశారు. చెడిపోయింది సమాజమా? లేక జేసీ రాజకీయమా? అన్న కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి. దశాబ్దకాలాల వరకూ శాసించిన తాడిపత్రిని కోల్పోవడంతోనే జేసీ బ్రదర్స్ కు మతి చెల్లించిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Advertisement
Jc diwakar Reddy comments on ycp
Jc diwakar Reddy comments on ycp

Jc diwakar Reddy : ప్లేస్ ఛేంజ్ మోడ్ లో..

జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు అక్కడి రాజకీయాలు కూడా పడటం లేదు. ఇటు అధికారంలో ఉన్న వైసీపీ ఇబ్బందులు పెట్టడం, అటు సొంత పార్టీ టీడీపీలో మద్దతు కరువు అవడంతో ఏపీని వదిలి తెలంగాణకు వస్తానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు.

Jc diwakar Reddy comments on ycp
Jc diwakar Reddy comments on ycp

వైసీపీ దెబ్బకు వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ నెగ్గుకు రావడం కష్టమే. మొన్నటి ఎన్నికల్లోనే దారుణ ఓటమిని చవి చూసిన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం, టీడీపీ పట్టు సాధించేందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారా? అన్నది స్పష్టమవుతుంది. టీడీపీ అధినాయకత్వాన్ని బెదిరించేందుకే జేసీ దివాకర్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారంటున్నారు. మొత్తం మీద జేసీలో వేదాంత ధోరణి తాత్కాలికమే. పొలిటికల్ గా రైజ్ అయిన వెంటనే ఆయనకు రాజకీయాలు, సమాజం అందంగా కన్పించవచ్చని టాక్ కూడా వినిపిస్తోంది.

Advertisement
Advertisement