JC Prabhakar Reddy : నడి రోడ్డు మీద దొరికిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పటినుంచో చూస్తోన్న జగన్ కి కరక్ట్ పాయింట్ లో దొరికాడు..!
JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుసు కదా. ప్రస్తుతం ఆయన ఎలాంటి మంత్రి పదవిలో లేరు. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. కానీ… మున్సిపల్ చైర్మన్ మాత్రం అయ్యారు. కానీ.. ఆయన దౌర్జన్యాలు మాత్రం ఆగలేదు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. అనంతపురంలోని సుభాష్ రోడ్డులో ఉన్న ఓ దుకాణం విషయంలో ఆయన దౌర్జన్యానికి దిగడం తాజాగా చర్చనీయాంశం అయింది. ఆ షాపును బాబయ్య అనే వ్యక్తి జేసీ ట్రావెల్స్ కు అద్దెకు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జేసీ ట్రావెల్స్ వాళ్లు అద్దె కట్టలేదట.
నిజానికి.. ఆ షాపు యజమాని మల్లికార్జున ఆచారి. 2010 కి ముందు అంటే.. 2000 నుంచి 2010 వరకు బాబయ్య అనే వ్యక్తి ఆ షాపును అద్దెకు తీసుకున్నాడు. 2010 లో ఆ షాపును జేసీ ట్రావెల్స్ కోసం ఇచ్చారు. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు జేసీ ట్రావెల్స్ నుంచి రూపాయి కూడా అద్దె రాలేదట. దీనికి సంబంధించి జేసీపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు ఆచారి. అయితే.. షాపునకు రెంట్ ఇవ్వకుండా, ఖాళీ చేయకుండా జేసీ దౌర్జన్యం చేస్తున్నారని ఎస్పీకి ఆచారి ఫిర్యాదు చేశారు. షాపు పగలగొడతా… నిన్ను మర్డర్ చేస్తా అంటూ జేసీ బెదిరిస్తున్నారట.
JC Prabhakar Reddy : షాపు ఖాళీ చేయకుండా దౌర్జన్యం చేస్తున్న జేసీ
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఉండటం వల్ల.. ఆయన్ను ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారని.. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని లేకపోతే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని షాపు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. తన ఇద్దరు కొడుకులు నిరుద్యోగులని.. వాళ్లకు ఆ షాపులో ఏదైనా వ్యాపారం పెట్టించాలని అతడు అనుకుంటున్నా.. జేసీ ట్రావెల్స్ మాత్రం అక్కడి నుంచి షాపు ఖాళీ చేయడం లేదని వాపోతున్నాడు.