Data Plans | ఎయిర్ టెల్‌, జియో వినియోగ‌దారులకి గుడ్ న్యూస్.. డేటా విష‌యంలో ఇబ్బందులు ఉండ‌వు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Data Plans | ఎయిర్ టెల్‌, జియో వినియోగ‌దారులకి గుడ్ న్యూస్.. డేటా విష‌యంలో ఇబ్బందులు ఉండ‌వు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :8 October 2025,8:00 pm

Data Plans | ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా జీవితం గ‌డ‌ప‌డం క‌ష్టం. ఇప్పుడంతా అన్‌లిమిటెడ్ డేటా వచ్చేయడంతో.. ఇంటర్నెట్‌ వినియోగానికి ఎలాంటి స‌మ‌స్య లేకుండా పోయింది. కాగా ఒక్కోసారి రోజువారీ డేటా లిమిట్ అయిపోయినపుడు అది అతి పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే ప్రముఖ టెలికాం సంస్థలు తన యూజర్ల కోసం అదిరిపోయే డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

#image_title

జియో ప్లాన్..

Jio తన యూజర్ల కోసం రూ.40 డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ఇది మూడు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 3జీబీ డేటా పొందుతారు. దీని బట్టి మూడు రోజులకు మొత్తం 9జీబీ హైస్పీడ్ డేటాను యూజర్లు పొందుతారు. అదే సమయంలో ఎయిర్‌టెల్ రూ.33లతో డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ఇది జియో కంటే తక్కువ వ్యవధిని అందిస్తుంది. ఈ ప్లాన్ ఒక రోజు మాత్రమే చెల్లుబాటుతో 2GB డేటాను అందిస్తుంది. అంటే డేటా ప్యాక్‌ను యాక్టివేట్ చేసిన రోజు మాత్రమే చెల్లుతుంది.

కాగా జియో తన జియోఫోన్ వినియోగదారుల కోసం రూ.75 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 23 రోజుల వాలిడిటీతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 50 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తం 2.5 జీబీ డేటా (రోజుకు 0.1 జీబీ + 200 ఎంబీ అదనంగా) వస్తుంది. రూ.189 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, 2 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు, జియో యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది