TNR passes away : నటుడు, జర్నలిస్ట్ TNR కన్నుమూత
TNR passes away : సీనియర్ సినీ జర్నలిస్ట్.. సినీ నటుడు తుమ్మల నరసింహా రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఇండస్ట్రీ వారికి మరియు యూట్యూబ్ ప్రేక్షకులకు టీఎన్నార్ గా సుపరిచితుడు అయిన ఈయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. మొదట బాగానే ఉన్నా కూడా అనూహ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. రెండు రోజుల క్రితం టీఎన్నార్ ఆరోగ్య పరిస్థితి విషమించింది అంటూ వార్తలు వచ్చాయి. నిన్నంతా కూడా టీఎన్నార్ కోమాలోకి వెళ్లారని ఆయన కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేశారు. టీఎన్నార్ తిరిగి వస్తారని ఆయన మళ్లీ ఇంటర్వ్యూలు చేస్తారని ఆయన ఇంటర్వ్యూలను ఇష్టపడే వారు ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా టీఎన్నార్ మృతి విషయం అందరికి షాకింగ్.
టీఎన్నార్ మృతిపై పలువురు సంతాపం
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో ఈయన ఇంటర్వ్యూలు స్ట్రీమింగ్ అయ్యాయి. రెండు మూడు గంటల ఇంటర్వ్యూలు చేసి కూడా ప్రేక్షకులను అంత సమయం ఇంటర్వ్యూలను చూసేలా చేసిన టీఎన్నార్ ఈమద్య కాలంలో వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. చిన్న బడ్జెట్ సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా టీఎన్నార్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఆయన నటించిన పలు సినిమాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీఎన్నార్ మృతి చెందడం విచారకరం
టీఎన్నార్ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కత్తి మహేష్ సోషల్ మీడియాలో… ”స్క్రీన్ షేర్ చేసుకున్నాం. స్టేజ్ షేర్ చేసుకున్నాం. కలిసినప్పుడల్లా, “నీతో అందరూ ఇంటర్వ్యూలు చేసేసారు. నేను ఎప్పుడో చేస్తాను. అది చాలా స్పెషల్ గా ఉండాలి. ఉంటుంది.” అనేవాడు. దర్శకుడు అవుదామని వచ్చాడు. ఇరవైఏళ్లుగా ఏవేవో చేసాడు. ఇంటర్వ్యూయర్ గా చాలా ఫేమస్ అయ్యాడు. సినిమాల్లో యాక్టర్ గా విజృంభణలో ఉన్నాడు. త్వరలో దర్శకత్వం అన్నాడు. కానీ ఇలా…” అంటూ విచారం వ్యక్తం చేశాడు.