JR NTR : వైఎస్ విజయమ్మ .. జూనియర్ ఎన్టీఆర్‌కి కాల్ చేసి ఈ విషయం చెప్పుకొని బాధపడిందా..!
JR NTR : వైఎస్ విజయమ్మకి ఎన్టీఆర్‌కి అసలు సంబంధమే లేదు. ఆమె ఎన్టీఆర్‌కి కాల్ చేసి బాధపడడం ఏంటని అనుకుంటున్నారా..మేటర్‌లోకి వెళితే అసల విషయం తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం నటుడిగా కొనసాగుతుండగా, త్వరలో రాజకీయ నాయకుడిగా కూడా మారబోతున్నాడు. అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా నడుస్తుంది.అయితే ఎన్టీఆర్ టీడీపీలోకి వెళతాడా లేదంటే బీజేపీలోకి చేరతాడా అవి రెండు కాకుండా పవన్ మాదిరిగా కొత్త పార్టీ పెడతాడా అనే సందేహం అందరిలో ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ని టీడీపీలోకి స్వాగతించే పరిస్థితి లేదు. మరోవైపు తాత స్థాపించిన పార్టీని వదిలి ఎన్టీఆర్ బయటకు వెళ్లేలా కనిపించడం లేదు.
ఇటీవల ఎన్టీఆర్.. అమిత్‌షాతో భేటి కావడంతో ఆయన బీజేపీలోకి చేరతాడనే ప్రచారం జరిగిది. ఇందుకు కారణం తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్ రాజకీయాలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసేందుకు రంగం సిద్దమవుతుండగా, అదే సమయంలో వీరికి ప్రచారం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించేందుకే అమిత్ షా ఆయన్ను పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటివరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ను వచ్చే ఏడాది ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్టు టాక్ . అయితే అది బీజేపీ తరఫున కాకుండా , కూటమి తరఫున అనేది ఇక్కడ విశేషం. అయితే ఎన్టీఆర్.. అమిత్ షాని కలిసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది.
JR NTR : అంత బాధపడిందా?
ఆ మధ్య ఎన్టీఆర్ గెస్ట్‌గా వెళ్లాల్సిన ఈవెంట్‌ని ఏకంగా క్యాన్సిల్ చేశారు. ఒకవైపు ఎన్టీఆర్ ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయకముందే రాజకీయాలలో ఎన్టీఆర్ వైబ్రేషన్స్ మాత్రం కదలాడుతున్నాయి. ఇక ఎన్టీఆర్ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని అనుకున్న వైఎస్ విజయమ్మ ఆ మధ్య ఓ సారి జూనియర్ కి ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుందట. తెలంగాణలో తన కూతురు ఒంటరిగా పోటీ చేస్తుందని, జగన్‌తో ఇప్పుడు రిలేషన్స్ సరిగా లేని క్రమంలో బిడ్డ ఒక్కతే ఒంటరి అయందని మీ మద్దతు కూడా కొంచెం ఇస్తే బాగుంటుందని చెప్పి కన్నీరు పెట్టుకుందట విజయమ్మ. వైయస్ఆర్ బిడ్డ మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలని ఆమెకు మీ సపోర్ట్ కావాలని వైయస్ విజయమ్మ ఎన్టీఆర్ కోరినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనికి ఎన్టీఆర్ కూడా పాజిటివ్‌గానే స్పందించినట్టు టాక్.