YS Jagan : గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం .. వారికి ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో కల్లుగీత కార్మికులకు శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని జగన్ ప్రభుత్వం రెండింతలు చేసింది. ఈ మేరకు 5ఏళ్ళ పాలన కాలానికి సంబంధించి నూతన కల్లుగీత విధానం ప్రకటించడం జరిగింది. కల్లుగీత కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి ₹5 లక్షల పరిహారాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం అందించడం జరిగింది.
అయితే నూతన కల్లుగీత విధానం ద్వారా వస్తున్న ఈ ఐదు లక్షల పరిహారనీ… పది లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మొత్తంలో ఐదు లక్షల రూపాయలు వైయస్సార్ బీమా ద్వారా అందించనుండగా మిగిలిన ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా రూపంలో ప్రభుత్వం అందించనుంది. అంతేకాదు కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అంగవైకల్యం పొందిన వారికి ..
ప్రత్యామ్నాయ నైపుణ్య అభివృద్ధి విభాగం ద్వారా శిక్షణ మరియు ఆదాయ మార్గాలను చూపించమన్నారు. ఇక కల్లుగీత కార్మికుడు సహజ మరణం చెందితే.. వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా ఐదు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 2022-2027 వరకు ఇది అమలులో ఉండనుంది. నూతన కల్లుగీత విధానం ద్వారా రాష్ట్రంలో 95,245 కల్లుగీత కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు.