Jr NTR vs Nara Lokesh : కంగారు పడుతోన్న నారా లోకేశ్.. ఎన్‌టిఆర్ దెబ్బకి వణుకు స్టార్ట్?
Jr NTR vs Nara Lokesh : గత కొన్ని రోజుల నుంచి ఓవైపు తెలంగాణ, మరోవైపు ఏపీ రాజకీయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ గురించే చర్చ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి పనులైతే చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అనుకున్నారో అదే జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. టీడీపీ తమ చేతుల్లోంచి చేజారడమే కాదు.. ఆ పార్టీకి అధినేతగా జూనియర్ ఎదుగుతాడని.. అతడే పార్టీకి వారసుడు అవుతాడని చంద్రబాబు, లోకేశ్ భయపడుతున్న విషయం తెలిసిందే. కానీ.. కేంద్ర మంత్రి జూనియర్ ఎన్టీఆర్ ను కలిసే సరికి.. ఇప్పుడు ఏం చేయాలి అనేదానిపై టీడీపీ అధినేత మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది..
నిజానికి రాజకీయాలపై ఎన్టీఆర్ కు ఆసక్తి ఉంది అని చెప్పడానికి 2009 ఎన్నికలే నిదర్శనం. టీడీపీలో చంద్రబాబు తర్వాత సమర్ధవంతమైన నాయకుడు ఎవరూ లేరని.. ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబు తర్వాత పార్టీకి ఆయనే వారసుడు అవుతాడని.. టీడీపీ బాగుపడాలంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని పార్టీ శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ.. చంద్రబాబు, బాలకృష్ణ ఇద్దరూ జూనియర్ ను టీడీపీలోకి తీసుకురావానికి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.
Jr NTR vs Nara Lokesh : లోకేశ్ ను వారసుడిగా ప్రకటించేస్తారా?
అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను కలవడంతో బీజేపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా అనే దానిపై క్లారిటీ రావడం లేదు. కానీ.. లోకేశ్ ను అయితే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో లోకేశ్ ను హైలైట్ చేయడం కోసం.. లోకేశ్ పేరును తెరపైకి తీసుకురావడం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా కలిసిన తర్వాత.. లోకేశ్ కూడా అమిత్ షాతో రహస్యంగా భేటీ అయ్యాడట. టీడీపీ, బీజేపీ పొత్తు కోసం అమిత్ షాను లోకేశ్ కలిశాడట. జూనియర్ పై సాగుతున్న ప్రచారాన్ని ముగించడం కోసం కావాలని లోకేశ్ పరపతిని పెంచడం కోసం ఈ ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఒకవేళ లోకేశ్ ను పైకి లేపాలనుకుంటే.. అమిత్ షాతో రహస్యంగా ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ తో రహస్యంగా భేటీ అవ్వాల్సిన అవసరం అమిత్ షాకు ఏముంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ భేటీ నిజమా కాదా అనేది పక్కన పెడితే.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ బాగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎత్తుకు పైఎత్తు వేస్తోంది. అమిత్ షాతో లోకేశ్ భేటీ విషయంపై బీజేపీ నేతలు మాత్రం ఏం మాట్లాడటం లేదు.