Junior NTR – Taraka Ratna : తారకరత్నను చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఓదార్చిన విజయసాయిరెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Junior NTR – Taraka Ratna : తారకరత్నను చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఓదార్చిన విజయసాయిరెడ్డి

 Authored By kranthi | The Telugu News | Updated on :20 February 2023,8:00 pm

Junior NTR – Taraka Ratna : నందమూరి తారకరత్న ఇక లేరు అనే నిజాన్ని అటు సినీ ఇండస్ట్రీ కావచ్చు.. ఇటు నందమూరి ఫ్యామిలీ, నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మనవడు, అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో తారకరత్న మరణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తారకరత్న మహాశివరాత్రి నాడు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో హుటాహుటిన ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించారు.

junior ntr crying after seeing taraka Ratna dead body

junior ntr crying after seeing taraka Ratna dead body

ఆదివారం ఫిలిం చాంబర్ లో ఉంచి ఆ తర్వాత తన ఇంటికి తరలించారు.తారకరత్నను చివరి సారి చూడటానికి వేల మంది అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. తారకరత్న తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్నకు నివాళులు అర్పించడానికి కళ్యాణ్ రామ్ తో కలిసి వచ్చారు. అక్కడ తన అన్న మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు జూనియర్ ఎన్టీఆర్. వెక్కి వెక్కి ఏడ్చారు.

junior ntr crying after seeing taraka Ratna dead body

junior ntr crying after seeing taraka Ratna dead body

Junior NTR – Taraka Ratna : కన్నీళ్లు కార్చిన జూనియర్ ఎన్టీఆర్

తన అన్న మరణాన్ని జూనియర్ ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. గుండెలు పగిలేలా తన అన్నను చూసి ఏడ్చి.. ఓపిక లేక కుర్చీలో కూర్చుండిపోయారు. బాధతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిన విజయసాయి రెడ్డి ఆయన్ను ఓదార్చారు. ఎన్టీఆర్ ఏడుపు అయినా ఆపుకోలేకపోయాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఎన్టీఆర్ కు మంచినీళ్ల బాటిల్ ఇవ్వడంతో నీళ్లు తాగి కూల్ అయ్యాడు ఎన్టీఆర్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది