Sarkaru Vaari Paata Kalavathi Song : కళావతి ఒరిజినల్ సాంగ్ వీడియో విడుదల .. మహేష్ ఫ్యాన్స్ ఖుష్
Sarkaru Vaari Paata Kalavathi Song : మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, చిత్రం నుండి రేపు ఫస్ట్ సాంగ్ విడుదల చేయాలని అనుకున్నారు. కాని పాట లీక్ కావడంతో కొద్ది సేపటి క్రితం సాంగ్ విడుదల చేశారు. సాంగ్ టేకింగ్ చాలా రిచ్ అండ్ కలర్ ఫుల్ గా ఉంది. మహేష్, కీర్తి పెయిర్ చాలా అందంగా ఉంది. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ కళావతి సాంగ్ పాడారు. కెరీర్ లో మొదటిసారి మహేష్ సాంగ్ పడుతున్నారు సిద్ శ్రీరామ్. ప్రోమో సాంగ్ పై అంచనాలు పెంచేసింది. సర్కారు వ్ వారి పాట మూవీలో ఇది బెస్ట్ సాంగ్ కావచ్చు.

kalavathi original song released in Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata Kalavathi Song అదరగొట్టేశారు…
థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి యంగ్ రైటర్ అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కుతుంది. . ఈ లిరికల్ వీడియో కోసం బాగానే ఖర్చు చేశారు. ఏకంగా ఓ సెట్ వేసి మరీ షూట్ చేశారు. మ్యూజిక్ డైరక్టర్ తమన్, గాయకుడు సిద్ శ్రీరామ్ తో పాటు అంతా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయాడు. సిద్ అయితే తెల్ల చొక్కా, పంచె కట్టు, భుజంపై కండువాతో భలే గమ్మత్తుగా ఉన్నాడు.
క్లాసికల్, వెస్ట్రన్ మిక్స్ చేస్తూ ఈ పాటను కంపోజ్ చేశాడు తమన్. “కమాన్ కమాన్ కళావతి.. నువ్వు లేకుంటే అథోగతి” అంటూ సాగే కొన్ని లిరిక్స్ పాటకు ఓ కిక్ ఇచ్చాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఈ లిరికల్ వీడియోలో మహేష్ వేసిన స్టెప్ మరో ఎత్తు. ఈ పాటకు సంబంధించిన సిగ్నేచర్ స్టెప్పును లిరికల్ వీడియోలో పెట్టారు. శేఖర్ మాస్టర్ ఈ స్టెప్ కంపోజ్ చేశాడు. ఈ స్టెప్ తో పాటు.. కీర్తిసురేష్ చీర కుచ్చిళ్లను మహేష్ సవరిస్తున్న స్టిల్, టోటల్ లిరికల్ వీడియోలో హైలెట్ గా మారింది. ఈ సాంగ్ మహేష్‌కిమంచి హిట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుది.
