Kalvakuntla Kavitha : ఫోన్ లు పగలగొట్టిన కల్వకుంట్ల కవిత.. ఇక్కడే అతిపెద్ద ట్విస్ట్ బయటపడింది..!
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ సీబీఐ కూడా ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని తన ఇంట్లోనే సీబీఐ అధికారులు ఆమెతో భేటీ కానున్నారు. ఆమెను కలవనున్నారు. మరోవైపు కవిత ఫోన్లకు సంబంధించి కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. ఎందుకంటే.. లిక్కర్ స్కాంలో శరత్ అరోడాను ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ఆసమయంలో అధికారులు తయారు చేసిన రిపోర్ట్ లో కవిత పేరును చేర్చారు. ఆమె ఫోన్ల ప్రస్తావనను కూడా అందులో తీసుకొచ్చారు.అసలు కవిత ఫోన్ల గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారు అనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశమయింది. ఎందుకంటే.. ఈడీ రిమాండ్ రిపోర్టులో చూస్తే ఒక సంవత్సరం వ్యవధిలోనే కవిత తన రెండు నెంబర్ల కోసం పది ఫోన్లను మార్చారట. ఇటీవల ఆగస్టు నెలలోనే నాలుగు సార్లు ఫోన్లు మార్చారట. కేవలం మూడు రోజుల వ్యవధిలో అన్ని ఫోన్లను మార్చేయడం ఏంటి అనేది అంతుపట్టడం లేదు.
Kalvakuntla Kavitha : ఫోన్ల వ్యవహారం తెర మీదికి వచ్చిన రెండో రోజే కవితకు నోటీసులు
ఫోన్ల వ్యవహారం తెర మీదికి వచ్చిన రెండో రోజునే సీబీఐ నుంచి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు వచ్చాయి. అంటే.. తన ఫోన్ల వ్యవహారంపై కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఏడాది సమయంలోనే ఎందుకు పది ఫోన్లను మార్చారని కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే.. మూడు రోజుల వ్యవధిలో వేర్వేరు ఫోన్లను ఎందుకు మార్చేశారు అని కూడా కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. చూద్దాం మరి కవిత విషయంలో ఆ ఫోన్ల మార్పు వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో?