Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న క‌విత‌.. పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అసంతృప్తి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న క‌విత‌.. పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అసంతృప్తి

 Authored By ramu | The Telugu News | Updated on :12 May 2025,9:00 pm

Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో కామెంట్స్ . సోమవారం తెలంగాణ భవన్ లోని మీడియాతో మాట్లాడుతూ.. టీజీఐఐసీ పరిధిలో లక్షా 75వేల ఎకరాలను తాకట్టు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని, తన వద్ద నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

Kalvakuntla Kavitha : ఏం జ‌రుగుతుంది..!

గత 16 నెలల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని, తెచ్చిన అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని, అభివృద్ధికి వెచ్చించలేదని విమర్శించారు. తులం బంగారం ఇవ్వలేదని, మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయలేదని, ఏమీ చేయలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని పరిపాలనపైనే కవిత విమర్శలు చేస్తున్నారనే చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు, ఆమె వైఖరి ఆధారంగానే కవిత బీఆర్ఎస్‌ను వీడి కొత్త పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరందుకుంది.

Kalvakuntla Kavitha బీఆర్ఎస్ వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న క‌విత‌ పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అసంతృప్తి

Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న క‌విత‌.. పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అసంతృప్తి

ఈ ప్రచారంపై స్పందిస్తూనే కవిత తాజాగా పై విధంగా వ్యాఖ్యలు చేశారు. తనను రెచ్చగొట్టవద్దని, రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానని కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే చర్చకు దారితీస్తున్నాయి. గత కొంతకాలంగా కేసీఆర్ కుటుంబంలో విభేదాలున్నాయనే ప్రచారం నేపథ్యంలో, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య పొరపొచ్చాలున్నాయని, అవి మరింత తీవ్రమై అంతర్గత పోరుకు కారణమయ్యాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే వాదన ఉంది. తన ‘రెచ్చగొట్టవద్దు’ అనే వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనేది చర్చ‌నీయాంశంగా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది