Karthika Deepam 10 Aug Today Episode : కార్తీక దీపం లేటెస్ట్ ఎపిపోడ్ 10 ఆగస్టు 2021, మంగళవారం ఎపిసోడ్ 1114 తాజాగా రిలీజ్ అయింది. మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. మోనితకు కార్తీక్ గన్ గురిపెడతాడు. దీంతో నీ ఎదురుగా నేను ఉన్నాను. నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నాను. ఆరాధిస్తున్నాను. నీకు ఆ ప్రేమ కూడా కనిపించడం లేదు. ఓహ్.. దీప ఏమనుకుంటుందో అని భయపడుతున్నావా? దీపను అలా ఎలా వదిలేస్తాను. దీపను కూడా అవసరమైతే చంపిస్తా. దీపే కాదు.. మీ అమ్మను కూడా.. అని అనేసరికి.. వెంటనే తీవ్రంగా ఆవేశపడిన కార్తీక్.. నువ్వు ఇంత బరితెగించావా? నువ్వు అంతలా ప్రేమించిన ఆ మనిషి చేతుల్లోనే చచ్చిపో.. అని చెప్పి అక్కడి తనను షూట్ చేస్తాడు కార్తీక్.
కట్ చేస్తే.. డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్లారు.. అని తెగ టెన్షన్ పడుతుంటుంది దీప. అప్పుడే డాక్టర్ బాబు ఇంటికి తిరిగివస్తాడు. దీనంగా, బాధతో ఇంటికి వచ్చిన కార్తీక్ ను చూసి దీప షాక్ అవుతుంది. డాక్టర్ బాబు ఏమైంది.. ఎందుకు అలా ఉన్నారు.. అని అడుగుతుంది. ఏమైందో చెప్పండి.. అని అడుతుతుంది. దీంతో.. నాకేమైంది దీప.. నాకేం కాలేదు. కొన్నేళ్ల తర్వాత కళ్లు తెరిచి ప్రపంచాన్ని చూసినట్టుగా ఉంది. కొత్తగా ఉంది దీప. రోతగా ఉంది దీప.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని తెలిశాక.. నామీద నాకే కోపంగా ఉంది.. అని కార్తీక్ చెబుతాడు. అసలు.. ఎక్కడికి వెళ్లారు మీరు అని దీప అడగడంతో.. పాఠం నేర్చుకోవడానికి.. గుణపాఠం చెప్పడానికి. చాలా అధమ స్థాయికి వెళ్లి వచ్చాను దీప. అలసి పోయాను దీప. ఈ వయసులోనే వందేళ్ల జీవితాన్ని అనుభవించిన వాడిలా అలిసిపోయాను దీప. ఇక నావల్ల కాదు. నేను పూర్తిగా అలసిపోయా. 30 సంవత్సరాల వయసులోనే 100 సంవత్సరాల మెంటల్ టార్చర్ ను అనుభవించా. నాకు బతకడం చేతకాదు. నాలాంటి వాడు బతకడం కూడా వేస్టే. నాకు బతకడం చేతకాదు. చావడం చేతకాదు.. అని దీపతో అంటాడు డాక్టర్ బాబు.
నాకు బతకడం చేతకాదు. చావడం చేతకాదు. నాకు చచ్చిపోవాలని ఉంది.. అని అనగానే.. డాక్టర్ బాబు నీకు నేనున్నాను.. అనగానే.. ఎప్పుడు ఉన్నావు. నువ్వు అసలు ఎప్పుడు ఉన్నావు నాతోటి. అవసరం ఉన్నప్పుడు లేవు. నా జీవితం ఇలా తయారు కావడానికి కారణం నువ్వే. ఆత్మ గౌరవం తొక్కా తోలు అంటూ నేను నింద వేసినప్పుడు ఏం చేశావు.. అక్కడి నుంచి వెళ్లిపోయావు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని కాదు అని అన్నప్పుడు నువ్వు నన్ను చాచి పెట్టి కొట్టి.. ఆ విహారి గాడిని తీసుకురావడమో.. లేక డీఎన్ఏ టెస్ట్ చేయించడమో చేశావా? లేదు.. నన్ను వదిలేసి వెళ్లిపోయావు.
ఇక మా అమ్మ.. కోడలు తరుపున నిలబడి.. కొడుకును మార్చాలని చూసింది తప్పితే.. కోడలు తలరాతను మార్చాలని చూడలేదు. ఆవిడ.. నన్ను, పిల్లలను తీసుకెళ్లి ఆనాడే డీఎన్ఏ టెస్ట్ చేయించి ఉంటే.. ఈనాడు నేను ఒంటరినయ్యే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అమ్మగా నాకు తోడుగా ఉండాల్సిన సమయంలో తను నా పక్కన లేదు. నీ పక్కన చేరింది. ఇక.. పిల్లలు.. ఎంత మంచి పిల్లలు.. వాళ్ల బాల్యమంతా చిదిమేసింది నువ్వు, మా అమ్మ. నా బిడ్డను నేను దత్తత తీసుకునే పరిస్థితి కల్పించింది మా అమ్మ. నా కూతురే.. కానీ నాకు తెలియదు. ఎవరు కన్న బిడ్డో అనుకొని పెంచుకున్నాను. రౌడీని పాపం.. ఏ పాపం తెలియని రౌడీని పరాయిదాని లాగానే చూశాను. పదేళ్ల పాటు నా బిడ్డలు నాకు కాకుండా పోవడానికి కారణం నువ్వు, మా అమ్మే కదా. తండ్రిగా నేను ఓడిపోయాను దీప. ప్రపంచంలో ఎవ్వడికైనా ఇలాంటి దరిద్రపు పరిస్థితి వస్తుందా చెప్పు. మీరు.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అని దీప అనగానే.. నన్ను నేను సమర్థించుకోవడానికి చెప్పట్లేదు. కానీ.. ఆనాడు ఇవన్నీ జరిగి ఉంటే.. ఇన్నేళ్లు నేను ఇంతలా బాధపడి ఉండేవాడిని కాదు. నావాళ్లంతా నన్ను వెలివేశారు. నన్ను వెలివేసిన వాళ్లంతా నావాళ్లు అవ్వడం నా దురదృష్టం. అప్పుడు నావాళ్లు లేనప్పుడు నేనున్నాను.. అంటూ ఓదార్పు ఇచ్చేవాళ్లు ఉంటే.. నేనే కాదు.. ఎవ్వడైనా ఆ ఓదార్పు కోసం వెళతాడు. అలా.. నేను మోనిత దగ్గరికి ఆ ఓదార్పు కోసం వెళ్లాను. అక్కడ మోసపోయాను. నా తమ్ముడు ఆదిత్య.. నీ తరుపునే వాదించి.. పిల్లలు పుడతారా? పుట్టరా? అని టెస్ట్ చేయించుకోమ్మంటే చేయించుకున్నా. ఇంతలో తులసి విషయం తెలిసి అప్పుడు నమ్మాను. మోనిత గర్భవతి ఎలా అయిందో తెలుసా? అది ఇంకా విచిత్రం.. అది ప్రపంచంలోనే ఎవ్వరికీ జరగని ఒక వింత విషయం. టెస్టుల కోసం నేను ఇచ్చిన శాంపిల్స్ ను ఆ మోనిత తీసుకొని తన గర్భంలో ప్రవేశపెట్టుకుంది. ఆర్టిఫిషియల్.. కృత్రిమ గర్భం.. అలా ఆమె తల్లి అయింది.. అని డాక్టర్ బాబు చెప్పగానే.. మీరు ఏమంటున్నారు.. అంటూ దీప షాక్ కు గురవుతుంది.
అవును.. నాకు తెలియదు..నాకు తెలియదు.. అని ఇన్నాళ్లు ప్రతి ఒక్కరికి నేను చెప్పాను. నాకే తెలియకుండా ఎలా జరిగింది అనడానికి ఇవాళ నాకు సమాధానం దొరికింది. దానికి కారణం ఆదిత్య. వాడెవడు.. నా తమ్ముడే. వాడే కనుక రెచ్చగొట్టకపోయి ఉంటే.. నా బతుకు నా చేతుల్లోంచి జారిపోయేదా? బయటివాళ్లు ఎవ్వరూ లేరు దీప. నా ఇంట్లో వాళ్లే నన్ను దూరం పెడితే.. బయటివాళ్లకు అవకాశం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు చెప్పు.. ఇంత మోసం చేసిన.. ఆ మోనితను చంపేయాలనిపిస్తుందా లేదా? చంపేయాలనిపిస్తుందా లేదా? చెప్పు దీప.. అని డాక్టర్ బాబు అడుగుతాడు.
ఇంతలో పిల్లలు అక్కడికి వస్తారు. నాన్న.. డాడీ.. అంటూ వస్తారు. ఎక్కడికి వెళ్లిపోయావు నాన్న.. అని అడుగుతారు పిల్లలు. దీంతో.. ఎక్కడికీ వెళ్లిపోలేదు అమ్మ. ఇక్కడే ఉన్నాను.. అంటూ చెబుతాడు. అమ్మా.. మీరు.. నేను.. అందరం కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతాం.. ఓకేనా.. అని చెబుతాడు.
కట్ చేస్తే.. కార్తీక్.. నాన్న బాధపడుతూ ఉంటాడు. డాడీ.. ఏమైంది అని ఆదిత్య అడుగుతాడు. దీంతో రాత్రంతా నిద్రలేదురా అని అంటాడు. ఏమైంది డాడీ అంటే.. పెద్దోడి గురించే ఆలోచిస్తున్నానురా. వాడిని చూడాలని ఉందిరా. వాడిని చూసేవరకు నా మనసు ఆగడం లేదురా.. అంటే సరే డాడీ వెళదాం. ముందు మీరు ఫ్రెష్ అవ్వండి.. అంటాడు ఆదిత్య.
కట్ చేస్తే… ఏసీపీ రోషిణి మేడమ్.. కార్తీక్ ఇంటికి పోలీసులను తీసుకొని వస్తుంది. ఇంతలోనే కార్తీక్, దీప.. ఏసీపీ దగ్గరికి వెళ్లడానికి బయలుదేరగానే.. ఆమె కార్తీక్ అంటూ ఇంట్లోకి వస్తుంది. హమ్మయ్య.. రండి మేడం.. మేమే మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాం.. అని చెబుతుంది దీప. దీంతో లొంగిపోవడానికా.. అని అడుగుతుంది ఏసీపీ. లొంగిపోవడం ఏంటి? పారిపోవడం ఏంటి మేడం. మీరు ఏం మాట్లాడుతున్నారు. మేము మోనిత విషయం మీకు చెప్పడానికి బయలు దేరాం మేడం.. అని అనగానే.. నువ్వే స్వయంగా సరెండర్ చేయడానికి తీసుకొస్తున్నావా? చూడు కార్తీక్.. నీమీద కాస్తో కూస్తో గౌరవం ఉండేది. ఇవాళ్టితో అది కూడా పోయింది. ఎక్కడ దాచావు.. మోనిత శవాన్ని.. అని ప్రశ్నిస్తుంది రోషిణి. ఎవరిని అంటే.. మోనిత శవాన్ని అని అడుగుతుంది. దీంతో శవమా? మోనిత శవం ఏంటి? అని కార్తీక్ అనడంతో షట్ అప్.. ఇన్ని రోజులు మోనిత తప్పు చేసింది అని అనుకుంటున్నా కానీ.. నువ్వు ఇలా చేస్తావని నేను ఏనాడూ అనుకోలేదు.. అనగానే మేడం.. మీరు డాక్టర్ బాబును ఎందుకు నిలదీస్తున్నారు.. అసలు ఏం జరిగింది మేడమ్ అని దీప భయంగా అడుగుతుంది. దీంతో నీకు ఈ పెద్దమనిషి ఏం చెప్పలేదా? అంటే నాకేం చెప్పలేదు మేడమ్.. ఏం జరిగింది.. అని అడిగింది.
మోనిత నిజస్వరూపం గురించి చెప్పడానికి మీ దగ్గరికి బయలుదేరాం మేడమ్.. అంటే మోనితే లేనప్పుడు మోనిత గురించి ఎందుకు ఇప్పుడు? మోనితే లేదు.. మోనిత శవం కూడా లేదు.. అని రోషిణి మేడమ్ అంటుంది. దీంతో వాళ్లు షాక్ అవుతారు. తర్వాత పోలీసులు.. డాక్టర్ బాబును అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. డాడీని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు.. అని పిల్లలు దీపను అడుగుతారు. నాన్న ఎప్పుడు వస్తారు.. అని అడిగితే నాకు తెలియదు అని చెబుతుంది దీప.
కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్ కు కార్తీక్ అమ్మ వెళ్తుంది. ఒక గన్ పట్టుకొని వెళ్తుంది. మీరెందుకు వచ్చారు.. అని కార్తీక్ అమ్మను ఏసీపీ ప్రశ్నిస్తుంది. దీంతో.. మోనితను చంపింది నేనే. నా కొడుకుకు నేనంటే చాలా ఇష్టం. అందుకే.. నేను చేసిన నేరాన్ని తన మీద వేసుకున్నాడు.. అంటూ చెబుతుంది. కార్తీక్ ను రిలీజ్ చేసి నన్ను అరెస్ట్ చేయండి.. అని అంటుంది కార్తీక్ తల్లి. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే బుధవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.