karthika deepam 30 july 2021 episode 1105 highlights
Karthika Deepam Today Episode : కార్తీక దీపం 30 జులై 2021 ఎపిసోడ్ 1105 తాజాగా విడుదలైంది. ఈ ఎపిసోడ్ ప్రారంభమే.. మోనిత, దీపల మధ్య స్టార్ట్ అవుతుంది. కాఫీ తాగుతారా మేడమ్ అంటూ.. ప్రియమణి.. మోనితను అడుగుతుంది. దీంతో కాఫీ తాగడానికే నేను బతుకుతున్నానా? నాకు వద్దు అని అనగానే.. నాకు ఇవ్వు ప్రియమణి అంటూ సడెన్ గా ఎంట్రీ ఇస్తుంది దీప. దీంతో షాక్ కు గురవుతుంది మోనిత.
karthika deepam 30 july 2021 episode 1105 highlights
దీప ఇక్కడికి ఎందుకు వచ్చింది. అంజితో నా పెళ్లి ఆపించింది దీపేనా.. అంటూ తనలో తాను అనుకుంటుంది. నీకు ఇందాక ఫోన్ వచ్చిందా? ఎవరు ఫోన్ చేశారు నీకు అంటే.. నాకెవ్వరూ ఫోన్ చేయలేదు అంటుంది మోనిత. ఇంతలోనే ఏసీబీ రోషిణి మేడం ఫోన్ చేస్తుంది. దీంతో ఫోన్ ఎత్తి.. మేడం అనగానే.. బయలుదేరావా? అని అడుగుతుంది. వస్తున్నా మేడం అనగానే నీకోసం కూడా వెయిట్ చేయాలా? అని చిరాకుతో ఫోన్ పెట్టేస్తుంది మోనిత.
ఆ తర్వాత.. నేను ఇప్పుడు ఏసీపీ మేడం దగ్గరికి వెళ్తున్నా. అక్కడికి వెళ్లాక.. నీ సంగతి చెబుతా అని మోనిత అనగానే.. వెళ్తున్నా కాదు మోనిత… వెళ్తున్నాం. మేడం నాకు కూడా కాల్ చేసిన రమ్మన్నది. అక్కడ అంజి ఉన్నాడో.. ఎవరు ఉన్నారో.. పదా పదా.. అక్కడికి వెళ్లాక నీకు ఉంటుంది పదా.. అంటూ మోనితను తీసుకొని రోషిణి మేడం ఇంటికి వెళ్తుంది దీప.
కట్ చేస్తే.. కార్తీక్ ఇంటికి వెళ్తాడు. అక్కడ పిల్లలు మొక్కలకు నీళ్లు పెట్టడం చూసి మీరేం చేస్తున్నారు అంటూ కార్తీక్ అంటాడు. మొక్కలకు నీళ్లు పోస్తున్నాం.. అని చెబుతారు పిల్లలు. ఇంతకీ అమ్మ ఎక్కడికి వెళ్లింది అని అడుగుతాడు కార్తీక్. అమ్మ ఆసుపత్రికేగా వచ్చింది. అని పిల్లలు చెప్పగానే షాక్ అవుతాడు కార్తీక్. ఇంతకీ దీప ఎక్కడికి వెళ్లింది అని భయపడతాడు కార్తీక్. అమ్మ ఏదో గుడ్ న్యూస్ చెబుతానంది డాడీ అనగానే.. సరే.. పదా చెట్లకు ఎరువు తీసుకొద్దాం అని పిల్లలను తీసుకెళ్తాడు కార్తీక్.
karthika deepam 30 july 2021 episode 1105 highlights
ఇంతలోనే.. ఆనంద రావు.. కార్తీక్ గురించి ఆలోచిస్తుంటాడు. కార్తీక్ నిజంగా ఏ తప్పు చేయకున్నా నేనే అపార్థం చేసుకున్నానా అని అనుకుంటాడు. తన చిన్న కొడుకు వచ్చి టాబ్లెట్లు ఇవ్వగానే.. మీ అన్నయ్య ఎక్కడ.. వాడికి ఫోన్ చేయి.. అని అనగానే.. ఎందుకు డాడీ.. మీరు అన్నయ్యను గుర్తు చేసుకొని ఆవేశపడకండి.. అని అంటాడు. అదేం లేదు.. వాడికి ఫోన్ చేసి రమ్మను.. అని అంటాడు.
karthika deepam 30 july 2021 episode 1105 highlights
కట్ చేస్తే.. రోషిణి మేడం దగ్గరికి మోనిత, దీప ఇద్దరూ వెళ్తారు. అయితే.. మోనిత.. దీపను ఎందుకు తీసుకొని వచ్చావు.. నేను మోనితనే పిలిచాను కదా అని రోషిణి అడుగుతుంది. నువ్వు రావాలని అనుకుంటే నీకు అపాయింట్ మెంట్ అవసరం లేదు దీప అని అంటుంది రోషిణి. మీరు మోనితను పిలిచారు.. మోనితను కలిశాను. అందుకే ఇద్దరం కలిసి రావాల్సి వచ్చింది. నిన్ను అర్జెంట్ గా పిలవడానికి కారణం అంజి.. అంటూ షాక్ ఇస్తుంది రోషిణి.
ఇక.. కార్తీక్.. తన తండ్రిని చూడటానికి ఇంటికి వెళ్తాడు. నిన్ను ఇప్పటి వరకు అనని మాటలు ఎన్నో అన్నాను. నాకు చాలా బాధేస్తుంది. నువ్వు బాగుండాలిరా.. అంటూ ఆనంద రావు అంటాడు. నీ సంసారం చిన్నాభిన్నం అయింది. నువ్వు, దీప ఏనాడూ సరిగ్గా కలిసి ఉండలేదు. కానీ.. ఇంతలోనే మళ్లీ ఈ సమస్య. నా కోడలు దీప బంగారం. ఆమె దీపం. నువ్వు చీకట్లో నిలబడినా.. వెలుగులా నీ వెంటే ఉంటుంది. నువ్వు ఇన్నేళ్లు చీదరించినా.. అవమానించినా.. దూరం పెట్టినా నిన్ను ఏమాత్రం తను దూరం పెట్టడం లేదు. నీ గురించి దీప చాలా గొప్పగా చెప్పింది. అటువంటి భార్య దొరకడం నీ అదృష్టం. దీపను మంచిగా చూసుకో.. అంటూ ఆనంద రావు.. తన కొడుకుకు చెబుతాడు. అలా ఈరోజు ఎపిసోడ్ నడుస్తుంది.
karthika deepam 30 july 2021 episode 1105 highlights
అయితే.. మళ్లీ సీన్.. రోషిణి మేడం దగ్గరికి వెళ్తుంది. అంజి నీకు ఎలా పరిచయం అని మోనితను ప్రశ్నిస్తుంది రోషిణి. అయితే.. నాకు అంజితో పెద్దగా పరిచయం లేదు మేడం అంటుంది మోనిత. మరి.. నీతో ఏ సంబంధం లేకుంటే.. ఎంతో పరిచయం లేకుంటే అంజి.. రిజిస్ట్రార్ ఆఫీసుకు ఎందుకు ఫోన్ చేసి నీ పెళ్లి ఆపించాడు.. అని ప్రశ్నిస్తుంది రోషిణి మేడం. అంజి నిన్ను ప్రేమించాడా? పోనీ నువ్వు ప్రేమించావా? అనగానే.. ఛీ.. ఛీ.. వాడితో ప్రేమ ఏంటి అని అంటుంది మోనిత. దీంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.