Kaushik Reddy : టీఆర్ఎస్ లో చేరిన రోజే కౌశిక్ రెడ్డికి భారీ షాక్?

Kaushik Reddy టీఆర్ఎస్‌లో చేరిన రోజే హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డి Kaushik Reddy కి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్‌ Congressకు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి Kaushik Reddy …టీఆర్ఎస్ TRS Party లో చేరనున్న సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలు, జెండాలు కట్టారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి. వీటిని చూసిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వీటిపై మొత్తం 10 ఫిర్యాదులు రాగా.. రూ. 2 లక్షల 50 వేల జరిమానా విధించారు. రెండు ఫిర్యాదులకు లక్ష రూపాయల చొప్పున ఒక ఫిర్యాదుకు రూ. 15 వేలు మిగిలిన వాటికి రూ. 5 వేల చొప్పున జీహెచ్ఎంసీ జరిమానా విధించింది.

టీఆర్ఎస్ TRS Party అధినేత కేసీఆర్ KCR సమక్షంలో పాడి కౌశిక్‌రెడ్డి Kaushik Reddy పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ .. కౌశిక్ రెడ్డికి రాజకీయాల్లో, టీఆర్ఎస్‌లో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. అందుకు తాను మార్గం సుగమం చేస్తానని హామీ ఇచ్చారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన కేసీఆర్.. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని.. అయితే రాజకీయాల్లో మన ప్రస్థానం కొనసాగాలని సీఎం కేసీఆర్ కౌశిక్ రెడ్డికి సూచించారు. దీంతో కేసీఆర్ .. కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పడంతో.. ఇదేనా అంటూ సెటైర్లు పేలుతున్నాయి. చలాన్ల బాదుడుపైనా సర్వత్రా ట్రోల్స్ సాగుతున్నాయి.

Kaushik Reddy Rs 3L fine GHMC

ఫ్లెక్సీలు, హెల్డింగ్స్ పై .. ఫిర్యాదుల ఎఫెక్ట్.. Kaushik Reddy


కౌశిక్ రెడ్డి Kaushik Reddy టీఆర్ఎస్‌ TRS Party లో చేరుతున్న సందర్భంగా గచ్చిబౌలి నుండి టీఆర్ఎస్ భవన్ వరకూ భారీ ఎత్తున హోల్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహానగరంలో దాదాపు 20 కిలో మీటర్ల మేర వేలాది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని మంగళవారం ఏర్పాటు చేయగా బుధవారం సాయంత్రం వరకూ ఈ ఫ్లెక్సీలు, హోల్డింగ్స్ ఉన్నాయి. అయితే వీటిపై పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెళ్లాయి. కాంగ్రెస్ Congress, బీజేపీ BJP నేతలతో పాటు నెటిజన్ లు సోషల్ మీడియా వేదికగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు, ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుండి జీహెచ్ఎంసీ GHMC ఎన్ ఫోర్స్ మెంట్ సదరు ఫ్లెక్సీలు, హోల్డింగ్ తొలగించే పని ప్రారంభించింది.

Kaushik Reddy Rs 3L fine GHMC

ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లేక్సీలు ఏర్పాటు చేసినందుకు కౌశిక్ రెడ్డి Kaushik Reddy కి జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ రూ.5.60 లక్షలు జరిమానా విధించింది. మరి కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పరిశీలించి జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకూ జీహెచ్ఎంసి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే ప్రధమమని తెలుస్తోంది. గతంలో పది వేలు, 20వేలు, లక్ష వరకూ మాత్రమే జరిమానాలు వసూలు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డికి బల్దియా భలే షాకిచ్చిందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. మరి దీనిపై కౌశిక్ రెడ్డి ఏం చేస్తారన్న చర్చ నడుస్తోంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago