Kavita – KCR : రేపు కవిత అరెస్టు అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
Kavita – KCR : బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత ఈడీ నోటీసులపై స్పందించడం జరిగింది.” విచారణ పేరుతో రేపు కవితను ఈడీ అరెస్టు చేస్తుందట… చేయనివ్వండి. ఏం చేస్తారో చూద్దాం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అప్పుడు గంగుల రవిచంద్ర… ఇప్పుడు నా బిడ్డ వరకు వచ్చారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా పని చేయాలి అని పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ కవితకు జారీ చేయడం జరిగింది.
మనీలాండరింగ్ కేసులో… నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో ఎమ్మెల్సీ కవితకి మద్దతుగా మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయలుదేరారు. రేపు ఎల్లుండి కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారంట. ఇదే సమయంలో ఢిల్లీలో న్యాయ నిపుణులతో కేటీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో కవిత నివాసానికి లాయర్లు చేరుకోవడం జరిగింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
80 నుండి 85% మంది ఎమ్మెల్యేలపై ప్రజలలో మంచి అభిప్రాయం ముందు. మిగిలిన వారిపై మంచి అభిప్రాయం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు నిత్యం పాదయాత్రలు చేస్తూ ప్రజలతో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. వారి పన్నాగాలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.