BRS : బీఆర్ఎస్ ఆవిర్భావం.. ఫస్ట్ పోటీ ఎక్కడో తెలుసా..?
BRS : తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి(BRS) పార్టీగా రూపాంతరం చెందింది. పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 1:20 నిమిషాలకు ఈసీ లెటర్ పై సంతకం చేయడం జరిగింది. అనంతరం బీఆర్ఎస్ జండాను ఆవిష్కరించారు. గతంలో టిఆర్ఎస్ జండాలో తెలంగాణ రాష్ట్ర పటం ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో భారతదేశ చిత్రపటాన్ని ఉంచారు. అంతేకాదు జై తెలంగాణకు బదులుగా జై భారత్ అనే నినాదాన్ని పేర్కొన్నారు.
ఇదే సమయంలో జెండాలో కారు గుర్తు కూడా లేదు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నేతలకు హాజరైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారటంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీగా మారిన తొలుత కర్ణాటకలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణకి సరిహద్దుల్లో ఉన్న ఆ రాష్ట్రంలోని ఏడు జిల్లాలలో అభ్యర్థులను పోటీకి దించే ఆలోచనలు కేసీఆర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఈనెల 14వ తారీకు కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభించనున్నట్లు సమాచారం. అనంతరం బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేయడంతో పాటు కార్యదర్శులను కూడా ప్రకటించనున్నారట. ఆ తర్వాత ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నాయకులతో సామాజిక కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.