Kesineni Nani : ఏపీలో అన్ని రాజకీయాలు ఒక ఎత్తు.. బెజవాడ రాజకీయాలు మరో ఎత్తు. ఎందుకంటే.. ఏపీ రాజకీయాల్లో బెజవాడ రాజకీయాలే వేరు. వాటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నిజానికి కృష్ణ జిల్లా రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో విజయవాడ రాజకీయాలు అంటేనే అదో వెరైటీ. ఇక్కడి ప్రాంత నేతల రాజకీయాలే వెరైటీగా ఉంటాయి. విజయవాడలో ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగానే రాజకీయాలు సాగుతున్నాయి. విజయవాడలోని కేశినేని బ్రదర్స్ లొల్లి చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. దీని వల్ల ఎక్కువగా లాభపడుతోంది ఎవరు?
నష్టపోతోంది ఎవరు అనేది పక్కన పెడితే అసలు కేసినేని బ్రదర్స్ మధ్య గొడవ ఎందుకు వచ్చింది. అది కూడా పరాకాష్టకు ఎందుకు చేరుకుంది అనేదే అందుపట్టని అంశం. కేశినేని ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్ ఈ రెండు అందరికీ తెలుసు. కేశినేని నాని ట్రావెల్స్ నడుపుతూనే ఆరెంజ్ ట్రావెల్స్ ను ప్రోత్సహించారు. కానీ.. అదే ఇప్పుడు మేకులా తయారైంది. దాని నుంచే తనకు తీవ్రంగా పోటీ రావడం కేశినేని నానికి మైనస్ పాయింట్ అయింది. ఒకప్పుడు ఇద్దరు అన్నదమ్ములు మిత్రులుగా ఉండేవారు. కానీ.. ఇప్పుడు వాళ్లు శత్రువులుగా మారారు. దానికి కారణం.. కేశినేని శివనాథ్ కూడా విజయవాడ ఎంపీ టికెట్ ను ఆశిస్తుండటం.
దానికోసం కేశినేని నాని శత్రువులను శివనాథ్ చేరదీస్తున్నారు. దీంతో కేశినేని నానికి ఇంటిపోరు ప్రారంభం అయింది. దీంతో ఇప్పుడు కేశినేని బ్రదర్స్ మధ్య ఇంటి పోరుగా మారిపోయింది. ఒకప్పుడు కేశినేని నానికి దేవినేని ఉమతో పోరు ఉండేది. బుద్ధా వెంకన్నతో పోరు ఉండేది. బోండా ఉమతో పోరు ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ పోరు కాస్త కేశినేని బద్రర్స్ మధ్యకు షిఫ్ట్ అయిపోయింది. కేశినేని బ్రదర్స్ వర్గాలు విడిపోతుండటంతో.. అది అంతిమంగా వాళ్ల ఫ్యామిలీకి, టీడీపీకే మైనస్ అని.. మధ్యలో వైసీపీ దూరి తన రాజకీయాలను తాను చేస్తోందంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. చూద్దాం మరి బెజవాడ రాజకీయాలు ఇంకెంత దూరం వెళ్తాయో?
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.