Kesineni Nani : చంద్రబాబు బొక్క బోర్లా పడేలాగా చావు దెబ్బ కొట్టిన కేసినేని నాని | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kesineni Nani : చంద్రబాబు బొక్క బోర్లా పడేలాగా చావు దెబ్బ కొట్టిన కేసినేని నాని

Kesineni Nani : ఏపీలో అన్ని రాజకీయాలు ఒక ఎత్తు.. బెజవాడ రాజకీయాలు మరో ఎత్తు. ఎందుకంటే.. ఏపీ రాజకీయాల్లో బెజవాడ రాజకీయాలే వేరు. వాటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నిజానికి కృష్ణ జిల్లా రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో విజయవాడ రాజకీయాలు అంటేనే అదో వెరైటీ. ఇక్కడి ప్రాంత నేతల రాజకీయాలే వెరైటీగా ఉంటాయి. విజయవాడలో ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగానే రాజకీయాలు సాగుతున్నాయి. విజయవాడలోని కేశినేని బ్రదర్స్ లొల్లి చిలికి చిలికి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :17 January 2023,12:00 pm

Kesineni Nani : ఏపీలో అన్ని రాజకీయాలు ఒక ఎత్తు.. బెజవాడ రాజకీయాలు మరో ఎత్తు. ఎందుకంటే.. ఏపీ రాజకీయాల్లో బెజవాడ రాజకీయాలే వేరు. వాటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నిజానికి కృష్ణ జిల్లా రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో విజయవాడ రాజకీయాలు అంటేనే అదో వెరైటీ. ఇక్కడి ప్రాంత నేతల రాజకీయాలే వెరైటీగా ఉంటాయి. విజయవాడలో ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగానే రాజకీయాలు సాగుతున్నాయి. విజయవాడలోని కేశినేని బ్రదర్స్ లొల్లి చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. దీని వల్ల ఎక్కువగా లాభపడుతోంది ఎవరు?

నష్టపోతోంది ఎవరు అనేది పక్కన పెడితే అసలు కేసినేని బ్రదర్స్ మధ్య గొడవ ఎందుకు వచ్చింది. అది కూడా పరాకాష్టకు ఎందుకు చేరుకుంది అనేదే అందుపట్టని అంశం. కేశినేని ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్ ఈ రెండు అందరికీ తెలుసు. కేశినేని నాని ట్రావెల్స్ నడుపుతూనే ఆరెంజ్ ట్రావెల్స్ ను ప్రోత్సహించారు. కానీ.. అదే ఇప్పుడు మేకులా తయారైంది. దాని నుంచే తనకు తీవ్రంగా పోటీ రావడం కేశినేని నానికి మైనస్ పాయింట్ అయింది. ఒకప్పుడు ఇద్దరు అన్నదమ్ములు మిత్రులుగా ఉండేవారు. కానీ.. ఇప్పుడు వాళ్లు శత్రువులుగా మారారు. దానికి కారణం.. కేశినేని శివనాథ్ కూడా విజయవాడ ఎంపీ టికెట్ ను ఆశిస్తుండటం.

kesineni brothers fight in vijayawada leads to problem for tdp

kesineni brothers fight in vijayawada leads to problem for tdp

Kesineni Nani : కేశినేని శివనాథే తనకు శత్రువు అయిపోయాడా?

దానికోసం కేశినేని నాని శత్రువులను శివనాథ్ చేరదీస్తున్నారు. దీంతో కేశినేని నానికి ఇంటిపోరు ప్రారంభం అయింది. దీంతో ఇప్పుడు కేశినేని బ్రదర్స్ మధ్య ఇంటి పోరుగా మారిపోయింది. ఒకప్పుడు కేశినేని నానికి దేవినేని ఉమతో పోరు ఉండేది. బుద్ధా వెంకన్నతో పోరు ఉండేది. బోండా ఉమతో పోరు ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ పోరు కాస్త కేశినేని బద్రర్స్ మధ్యకు షిఫ్ట్ అయిపోయింది. కేశినేని బ్రదర్స్ వర్గాలు విడిపోతుండటంతో.. అది అంతిమంగా వాళ్ల ఫ్యామిలీకి, టీడీపీకే మైనస్ అని.. మధ్యలో వైసీపీ దూరి తన రాజకీయాలను తాను చేస్తోందంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. చూద్దాం మరి బెజవాడ రాజకీయాలు ఇంకెంత దూరం వెళ్తాయో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది