Kethireddy : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం పై ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పీచ్ కి జగన్ చప్పట్లు వీడియో వైరల్..!!

Advertisement

Kethireddy : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాలలో చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడం జరిగింది. అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీ టిడిపి సభ్యుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హారహోరి వాతావరణం అసెంబ్లీలో నెలకొంది. పరిస్థితి ఇలా ఉంటే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అదరగొట్టే స్పీచ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో…

Kethireddy Venkatarami Reddy Speech AP Assembly 2023
Kethireddy Venkatarami Reddy Speech AP Assembly 2023

వందల వేల కోట్లు దారిమలై అని లెక్కలు మొత్తం అన్ని బయటపెట్టారు. ఈ స్కాంలో గంట సుబ్బారావు అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. కావాలని ఒక వ్యవస్థను సృష్టించి దానికి ముందుగానే ఘంటా సుబ్బారావుకి పదవి అప్పజెప్పి… చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. శేల్ కంపెనీలు సృష్టించి… వందలాది కోర్టు ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారని కంపెనీల పేర్లతో సహా లెక్కలు మొత్తం బయటపెట్టారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఎలా జరిగింది ఎవరెవరు అందులో భాగస్వాములు

Advertisement
MLA Kethireddy Mass Warning to SI
MLA Kethireddy Mass Warning to SI

అయ్యారు వారి పేర్లు మరియు కంపెనీల పేర్లతో సహా ఎమ్మెల్యే కేతిరెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ సంచలనం సృష్టించింది. దీంతో సీఎం వైఎస్ జగన్ స్పీచ్ అనంతరం చప్పట్లతో అభినందించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ స్కాంపై తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై తతంగం మొత్తం నడిపించారని.. వైసీపీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Advertisement
Advertisement