
Key remarks of MLA Balakrishna in Secunderabad Parliament Mini Mahanadu
Balakrishna : సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో పాల్గొన్న బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఎన్టీఆర్ తయారు చేసిన ఎంతోమంది నాయకులు ఇప్పుడు ఇతర పార్టీలలో ముఖ్య నాయకులుగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరుతో 100 సంవత్సరాల క్రితం ఓ వెలుగు వెలిగిందని పేర్కొన్నారు. ఆ వెలుగు వెయ్యి సంవత్సరాలు వెలుగుతుందని చెప్పుకొచ్చారు. తెలుగువాడి ఆత్మాభిమానం, ఆత్మగౌరవంను నిలపెట్టింది ఎన్టీఆర్ అని బాలయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పథకాలు ఇంకా కొనసాగుతున్నాయని…
Balakrishna is making the movie NBK 108 under the direction of Anil Ravipudi
ఇప్పుడు అవ్వే పథకాలు పేర్లు మార్చి ఇప్పుడు నడిపిస్తున్నారని వివరించారు. అటువంటి ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని.. నందమూరి కుటుంబంతోపాటు అభిమానులు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు బాలకృష్ణ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉందన్నారు. తెలంగాణ టీడీపీ బలోపేతం కోసం తాను కూడా కష్టపడతానని బాలయ్య మాట ఇచ్చారు. ఆనాడు సామాన్యుడు కోసం ఎన్టీఆర్ సాహసవపేతమైన పథకాలు అమలు చేశారని స్పష్టం చేశారు. పేదలను రాజకీయాలకు పరిచయం చేసిన నేత అని అభివర్ణించారు.
Key remarks of MLA Balakrishna in Secunderabad Parliament Mini Mahanadu
మహిళల కోసం యూనివర్సిటీ స్థాపించారు ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు యువత ఎన్నో కార్యక్రమాలు కొనసాగించాలని బాలయ్య పిలుపునిచ్చారు. తాను ఆంధ్రాలో ఎమ్మెల్యే అయినా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు. కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తనను అతిథిగా సంబోధించడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఏదిఏమైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.