వామ్మో.. కేజీ ఉప్పు ధర రూ.130.. వంటనూనె లీటర్ ధర రూ.300 .. దేవూడా…!
Essentials : సాధారణంగా మన దగ్గర కేజీ ఉప్పు ధర రూ.20, లీటర్ వంటనూనె రూ.150 ఉంటుంది. ఇకపోతే నిత్యావసర సరుకులు ధరలు కూడా కొంతమేరకు రీజనబుల్‌గానే ఉన్నాయి. అయితే, మన దేశంలోని ఆ ప్రాంతంలో మాత్రం నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఆ ప్రాంతం ఎక్కడుందంటే.. భారత్-చైనా సరిహద్దు ప్రాంతం ఉత్తారఖండ్ రాష్ట్రంలోని పిథోర్‌గఢ్ జిల్లాలో నిత్యావసర సరుకులు ధరలు చూసి జనాలు ఆందోళన చెందుతున్నారు.
Essentials : కేజీ ఉప్పు ధర రూ.130..
ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో కిలో ఉప్పును రూ.130కు అమ్ముతున్నారు. వంటనూనె లీటర్ ధర రూ.300 కాగా, ఎర్రపప్పు కేజీ ధర రూ.200, కేజీ బియ్యం ధర రూ.150 అయింది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం ఉపాధి లేక అల్లాడుతున్న సమయంలో ధరలు పెరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, అక్కడ ఇలా ధరలు పెరగడానికి కారణం ప్రకృతి విపత్తుయే. భారీ వర్షాల వల్ల అక్కడికి వెళ్లే రవాణా మార్గాలు క్లోజ్ అయ్యాయి. దాంతో రవాణా సౌకర్యాలు లేక అక్కడి వరకు నిత్యావసరాలు సరఫరా చేయలేకపోతున్నారు. ఇక అక్కడ సరుకులున్న వారు ధరలను అమాంతంగా పెంచేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.