Khiladi Lady. : వలపు వల ఆశచూపు రూ.17 లక్షలు నొక్కేసిన ఖిలాడీ లేడీ
ప్రధానాంశాలు:
Khiladi Lady. : వలపు వల ఆశచూపు రూ.17 లక్షలు నొక్కేసిన ఖిలాడీ లేడీ
Khiladi Lady. : బెంగుళూరు మహాలక్ష్మి సొసైటీకి చెందిన శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తోంది. 2023లో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి తన పిల్లలను శ్రీదేవి స్కూళ్లో చేర్పించాడు. దీంతో వీరి మధ్య పరిచయం ఏర్పడి, తర్వాత స్నేహంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి తన స్కూల్ నిర్వహణ ఖర్చులకు వ్యాపారిని నమ్మబలికి రూ.2 లక్షలు అప్పుగా తీసుకుంది. కాలక్రమేణా వారి మధ్య సంబంధం మరింత దగ్గరైంది. వ్యాపారి నుండి ఒక్క ముద్దుకు రూ.50 వేలు తీసుకునేంత వరకు వ్యవహారం వెళ్లింది.

Khiladi Lady. : వలపు వల ఆశచూపు రూ.17 లక్షలు నొక్కేసిన ఖిలాడీ లేడీ
Khiladi Lady ఛీ.. ప్రీ స్కూల్ నిర్వాహకురాలు ఇలాంటి పని చేస్తుందా..?
అప్పుగా తీసుకున్న మొత్తం తిరిగి ఇవ్వాలని వ్యాపారి అడగగా, శ్రీదేవి డబ్బుల స్థానంలో మరో డిమాండ్ చేసింది. లీవ్ ఇన్ రిలేషన్‌లో ఉంటే సర్దుబాటు చేసుకుందామని చెప్పింది. దీంతో వ్యాపారి రూ.15 లక్షలు చెల్లించాడు. కానీ ఫిబ్రవరిలో మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో వ్యాపారి ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఇదే క్రమంలో మార్చి 12న శ్రీదేవి వ్యాపారి భార్యకు ఫోన్ చేసి పిల్లల టీసీ కోసం భర్తను పంపించాలని చెప్పింది. వ్యాపారి స్కూల్‌కు వెళ్లేసరికి, అక్కడ రౌడీషీటర్లు గణేష్ కాలె, సాగర్ ఎదురయ్యారు. చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరి, రూ.1.90 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని వ్యాపారిని విడిచిపెట్టారు.
కానీ వ్యవహారం ఇక్కడితో ముగియలేదు. మార్చి 17న శ్రీదేవి వ్యాపారికి ఫోన్ చేసి, రూ.50 లక్షలు ఇచ్చినట్లయితే తనతో ఉన్న చాట్ డిలీట్ చేస్తానని బెదిరించింది. ఈ సంఘటనతో విసుగు చెందిన వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీదేవితో పాటు ఇద్దరు రౌడీషీటర్లను అరెస్ట్ చేశారు. వ్యాపారులపై వలపు వల వేసి డబ్బులు వసూలు చేసే కొత్త మోసాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.