Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది. చైనా వాసుల్లో పుట్టిన కివి, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో న్యూజిలాండ్‌కు ఎగుమతి కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కివిలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఈ పండులో పుష్కలంగా లభిస్తాయి.
కివి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
కివిలో అధికంగా ఉండే ఫైబర్, ప్రీబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది ఆమ్లత్వం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
కివిలో నారింజలతో సమానంగా విటమిన్ సి లభిస్తుంది. ఇది ఇనుము శోషణకు తోడ్పడుతూ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం ముడతలు లేకుండా యవ్వనంగా ఉండేందుకు సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

#image_title
గుండె జబ్బుల నుంచి రక్షణ:
కివిలోని విటమిన్ E రక్త నాళాలను విశ్రాంతిగా ఉంచి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది.
రక్తపోటు నియంత్రణ:
పొటాషియం సమృద్ధిగా ఉండే కివి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తూ అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది. ఇది గుండె మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
కివిలోని విటమిన్ A కంటిశుక్లం, ఆప్టిక్ నర్వ్ సమస్యలకు ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది. దృష్టిని మెరుగుపరచడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
కొలెస్ట్రాల్ నియంత్రణ:
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, శరీరంలో కొవ్వు పేరుకోకుండా నిరోధిస్తుంది.