Know who to refund in PM Kisan Yojana scheme
PM Kisan Yojana: రైతులక కోసం దేశంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రైతు కుటుంబాలకు రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున జమ చేస్తారు. ఇప్పటికే 11వ విడత రైతు ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ పథకం ద్వారా అనర్హులు లబ్ది పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. చర్యలు తీసుకోవడానికి రెడీ అయింది. అనర్హులు డబ్బులు పొందినట్లైతే రిటన్ చేయాలని సూచించింది. వాళ్లను గుర్తించి వాళ్ల లిస్టుని వెబ్ సైట్ లో పొందుపరచనుంది.
అయితే అర్హులు ఎవరు అనర్హులు ఎవరు.. ఎలా డబ్బును రిటర్న్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . మీరు డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ పోర్టల్ https://pmkisan.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఇందులో రీఫండ్ అనే అప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ నంబర్, అధార్ కార్డు నంబర్ లేదా ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయాలి. ఈ వివరాలను సబ్మిట్ చేస్తే ఒకవేళ మీరు ఎలాంటి డబ్బులు రిటర్న్ చేయాల్సిన అవసరం లేకుంటే యూ ఆర్ నాట్ ఎలిజబుల్ ఫర్ రీ ఫండ్ అని వస్తుంది. ఇలా వచ్చిన రైతులు అమౌంట్ రిటర్న్ చేయాల్సిన పనిలేదు.
Know who to refund in PM Kisan Yojana scheme
అలా కాకుండా రీఫండ్ ఆప్షన్ చూపిస్తే పొందిన ఆర్థిక సాయాన్ని తప్పకుండా తిరిగి చెల్లించాల్సిందే.. అయితే ఇందుకు సంబంధించిన అప్డేట్ త్వరలో వెలువడనుంది. అందుకే ఈలోపు రైతులు తమ స్టేటస్ ని చెక్ చేసుకుంటే అర్హులు ఎవరో అనర్హులు ఎవరో తెలిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనలో మార్పు చేసింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ రైతులపై పడనుంది. స్టేటస్ చూసుకోవాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నమోదు చేయాల్సిందే. ఇప్పటివరకూ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ సహాయంతో స్టేటస్ చెక్ చేసుకునేవారు. ఆ తరువాత కేవలం ఆధార్ నెంబర్‌తోనే స్టేటస్ చెక్ చేసుకునేలా మార్చారు. ప్రస్తుతం కేవలం మొబైల్ నెంబర్‌తోనే స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం ఉంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.