PM Kisan Yojana : పీఎంకేవై ప‌థ‌కంలో రీఫండ్ ఎవ‌రు చేయాలో తెలుసుకోండి.. మీ పేరుంటే త‌ప్ప‌దు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PM Kisan Yojana : పీఎంకేవై ప‌థ‌కంలో రీఫండ్ ఎవ‌రు చేయాలో తెలుసుకోండి.. మీ పేరుంటే త‌ప్ప‌దు

 Authored By mallesh | The Telugu News | Updated on :11 July 2022,8:30 pm

PM Kisan Yojana: రైతుల‌క కోసం దేశంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కం ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం ప్రతియేటా రైతు కుటుంబాలకు రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున జమ చేస్తారు. ఇప్పటికే 11వ విడత రైతు ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ ప‌థ‌కం ద్వారా అన‌ర్హులు ల‌బ్ది పొందుతున్న‌ట్లు కేంద్రం గుర్తించింది. చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి రెడీ అయింది. అన‌ర్హులు డ‌బ్బులు పొందిన‌ట్లైతే రిట‌న్ చేయాల‌ని సూచించింది. వాళ్ల‌ను గుర్తించి వాళ్ల లిస్టుని వెబ్ సైట్ లో పొందుప‌ర‌చ‌నుంది.

అయితే అర్హులు ఎవ‌రు అన‌ర్హులు ఎవ‌రు.. ఎలా డ‌బ్బును రిట‌ర్న్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . మీరు డ‌బ్బులు తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం ఉందా లేదా వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ పోర్టల్ https://pmkisan.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఇందులో రీఫండ్ అనే అప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ నంబ‌ర్, అధార్ కార్డు నంబ‌ర్ లేదా ఫోన్ నంబ‌ర్ ని ఎంట‌ర్ చేయాలి. ఈ వివ‌రాల‌ను స‌బ్మిట్ చేస్తే ఒక‌వేళ మీరు ఎలాంటి డ‌బ్బులు రిట‌ర్న్ చేయాల్సిన అవ‌స‌రం లేకుంటే యూ ఆర్ నాట్ ఎలిజ‌బుల్ ఫ‌ర్ రీ ఫండ్ అని వ‌స్తుంది. ఇలా వ‌చ్చిన రైతులు అమౌంట్ రిట‌ర్న్ చేయాల్సిన ప‌నిలేదు.

Know who to refund in PM Kisan Yojana scheme

Know who to refund in PM Kisan Yojana scheme

PM Kisan Yojana: రీఫండ్ ఆప్ష‌న్ వ‌స్తే..

అలా కాకుండా రీఫండ్ ఆప్ష‌న్ చూపిస్తే పొందిన ఆర్థిక సాయాన్ని త‌ప్ప‌కుండా తిరిగి చెల్లించాల్సిందే.. అయితే ఇందుకు సంబంధించిన అప్డేట్ త్వ‌ర‌లో వెలువ‌డ‌నుంది. అందుకే ఈలోపు రైతులు త‌మ స్టేట‌స్ ని చెక్ చేసుకుంటే అర్హులు ఎవ‌రో అన‌ర్హులు ఎవ‌రో తెలిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనలో మార్పు చేసింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ రైతులపై పడనుంది. స్టేటస్ చూసుకోవాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నమోదు చేయాల్సిందే. ఇప్పటివరకూ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ సహాయంతో స్టేటస్ చెక్ చేసుకునేవారు. ఆ తరువాత కేవలం ఆధార్ నెంబర్‌తోనే స్టేటస్ చెక్ చేసుకునేలా మార్చారు. ప్ర‌స్తుతం కేవలం మొబైల్ నెంబర్‌తోనే స్టేటస్ చెక్ చేసుకునే స‌దుపాయం ఉంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది