Home » Entertainment » Prabhas Will Chances Are Announced At Any Time
Entertainment

Prabhas : ఏ స‌మ‌యంలో అయిన ప్ర‌భాస్ అనౌన్స్ చేసే ఛాన్స్.. ఇక ద‌ద్ద‌రిల్లి పోవ‌డం ఖాయం

Authored By
Sam C
The Telugu News | Published on: July 11, 2022, 9:00 pm
Advertisement

Prabhas : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ఆయ‌న‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. అయితే ప్ర‌భాస్‌ని క‌ల‌వాల‌ని, ఆయ‌న‌తో ముచ్చ‌టించాల‌ని చాలా మంది అనుకుంటారు. కాని అది కావ‌డం లేదు. అంద‌రి హీరోల మాదిరిగా ప్ర‌భాస్ పెద్ద‌గా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌డు. చాలా తక్కువ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటాడు. మొదట ఫేస్ బుక్ మాత్రమే ప్రభాస్ కలిగి ఉండేవాడు. ఈమద్య ఇన్ స్టా గ్రామ్ లో జాయిన్ అయ్యాడు. ఆయ‌న ట్విట్టర్ ఎంట్రీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

అభిమానుల కోరిక మేర‌కు ప్రభాస్ ట్విట్టర్ లో జాయిన్ అవ్వబోతున్నాడనే సమాచారం అందుతోంది. ప్రభాస్ ను ఆయ‌న అభిమానులు మరియు సన్నిహితులు చాలా రోజులుగా ట్విట్టర్ లో జాయిన్ అవ్వాలంటూ ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల కోసం ట్విట్టర్ లో జాయిన్ అయ్యేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. ఏ సమయంలో అయినా కూడా ప్రభాస్ ట్విట్టర్ లో మొదటి ట్వీట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ట్విట్టర్ లో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఫాలోవర్స్ సంఖ్య తో రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అంటూ అభిమానులు అనుకుంటున్నారు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Prabhas will Chances are announced at any time

Advertisement

Prabhas : ట్విట్ట‌ర్ ఎంట్రీ..

ఆ సినిమా నిరాశ పర్చినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ మొదటి బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది. మరో వైపు సలార్ ఇంకా ప్రాజెక్ట్ కే సినిమాల యొక్క షూటింగ్ లు సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా స్పిరిట్ మరియు రాజా డీలక్స్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా బాలీవుడ్ లో ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ ను చేసేందుకు ప్రముఖ దర్శకుడికి ఓకే చెప్పడం జరిగిందట. మొత్తానికి సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే ట్విట్టర్ లో కూడా బిజీ అవ్వబోతున్నాడన్నమాట. ఇక అభిమానుల‌కి అన్ని ర‌కాలుగా నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంద‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి