Kodali Nani : జగన్ స్థాయి నీది కాదు, పది ఫెయిల్ అయిన నాతో పోటి పడు.. నారా లోకేష్ కి కొడాలి నాని సవాల్
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని మరో సారి తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నారా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ సమయంలో జగన్ రెడ్డిని తనపై పోటీ చేసి గెలవాలని నారా లోకేష్ సవాల్ విసరడం తో ఆ సవాల్ కి తాను సిద్ధం అంటూ కొడాలి నాని సవాల్ విసిరాడు. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి నారా లోకేష్ పప్పు నాయుడు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పదో తరగతి ఫెయిల్ అయిన నాతో పోటీ చేసి దమ్ముంటే నారా లోకేష్ గెలవాలని, విదేశాల్లో చదువుకుని వచ్చాను అంటూ చెప్పుకునే లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని పోయాడు. అలాంటి పప్పు గాడికి మా జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏంటీ అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నారా చంద్రబాబు నాయుడుకు గాని, లోకేష్ గాని అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని, వారికి ఎప్పుడూ కూడా ప్రజల యొక్క సంక్షేమం పట్టలేదని, వారు కేవలం వారి అధికారం కోసమే పని చేస్తారు అని చెప్పుకొచ్చారు.

Kodali nani again firing comments on nara lokesh and cbn
ముసలాయన్ని చంపేసి అధికారం లాక్కున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు అని.. కానీ ఆయన కొడుకు మరీ పప్పు గాడు గా ప్రవర్తించడంతో అధికారంలోకి రాలేక పోతున్నాను అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చంద్రబాబు అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక.. ఓర్వలేక వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వారికి ప్రజలు మరో సారి బుద్ధి చెప్పే వరకు ఇలాగే మాట్లాడుతారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్థాయికి వారు ఎప్పుడూ కూడా రాలేరు అన్నాడు.