Home » Andhra Pradesh » Kodali Nani Comments About Chandrababu Conspiracy
andhra pradesh

Kodali Nani : జగన్ జైలుకెళ్లిన 20 రోజులకే చంద్రబాబు కుట్ర తెలిసింది కొడాలి నాని సంచలన వ్యాఖ్యల వీడియో..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: February 28, 2023, 4:02 pm
Advertisement

Kodali Nani : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టిడిపి అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీలోకి పదవులు ఆశించి రాలేదని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు చేసిన కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా కేసుల్లో ఇరికించిన సమయంలో..బాబు కుట్ర తెలిసి 20 రోజుల తర్వాత టిడిపిని వదిలేసి వైసీపీలోకి.. వచ్చినట్లు కొడాలి నాని తెలిపారు. చంద్రబాబుతో తనకు ఎటువంటి గొడవలు లేవని అన్నారు. టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబు కుట్రలు దగ్గరుండి చూశాను.

Advertisement

Kodali Nani comments about Chandrababu conspiracy

లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకొని ఎన్టీఆర్ పై చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. చంద్రబాబుతో పాటు రామోజీరావు ఇంకా రాధాకృష్ణ.. వంటి వారు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా నందమూరి కుటుంబ సభ్యులను రెచ్చగొట్టారు. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వాళ్లు రాజకీయాలకు పనికిరారని ఇదే మీడియా చేత చంద్రబాబు దుష్ప్రచారం చేయించాడు. ఈ రీతిగా నందమూరి కుటుంబానికి చెందిన వాళ్లను రాజకీయాల్లోకి రాకుండా చంద్రబాబు ఇంటికి పరిమితం చేశాడు. అలాగే రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సర్వనాశనమవుతుందని ప్రచారం చేశాడు..

Advertisement

Kodali Nani comments about Chandrababu conspiracy

అనీ కొడాలి నాని మండిపడ్డారు. జగన్ కి వ్యతిరేకంగా లోకేష్, పవన్ కళ్యాణ్, పచ్చ మీడియా ఎంత చేసినా.. వచ్చే ఎన్నికలలో వైసిపి గెలవడం తధ్యమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ని చంపింది చంద్రబాబు. కుట్ర చేసి ముఖ్యమంత్రి పదవి నుండి ఎన్టీఆర్ను తొలగిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఎన్టీఆర్ నీ క్షోభ పెట్టి చంపితే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అయ్యాడు. అటువంటి చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయటం కోసం ఎన్టీఆర్ ఆదర్శవంతుడు అని.. దొంగ మాటలు చెబుతున్నాడు. . అంటూ చంద్రబాబుపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి