Kodali Nani : చంద్రబాబుని సంకెళ్లతో రూములో కట్టేయండి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: February 25, 2023, 5:02 pm

Kodali Nani : గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడికి సంబంధించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని ఖండించారు. ముఖ్యంగా పోలీసులపై బాబు చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. పోలీసులను ఉద్దేశించి మీకు సిగ్గుందా.. మీరు మనుషులేనా అని ఆ వయసులో అనటం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబును ఉద్దేశించి కొడాలి నాని ప్రశ్నించారు. పోలీసులు ఉండబట్టే రాజకీయ నాయకులు బతికి బట్ట కలుగుతున్నారని చెప్పుకొచ్చారు. నువ్వు చేసే వ్యాఖ్యలకు పౌరుషం కలిగిన ఏ పోలీస్ అయినా గన్ తీసి కాల్చేస్తే ఏమవుతుంది..?,

Kodali Nani Fires on Chandrababu

Kodali Nani Fires on Chandrababu

రాజకీయ నేతలను కాపాడే పోలీసులకు కులం.. మతం… ఆపాదించటం దారుణమని అన్నారు. ఈ రకంగానే చంద్రబాబు పిచ్చి కుక్కలాగా వాగి ఎవరితో ఒకరితో రౌండ్ వేయించుకుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కల్పించాడని ఆరోపిస్తాడు. ఇతనిని మానసిక రోగికి రూమ్ కేటాయించినట్లు కుటుంబ సభ్యులు ఇంట్లో ఓ రూమ్ కేటాయించాలని అందుట్లో ఉంచేయాలని కొడాలి నాని కోరారు. చంద్రబాబే… పట్టాభిని ఉసిగొలిపారని ఆరోపించారు. గన్నవరం వైసీపీ పార్టీ కార్యకర్తలపై ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులపై గొడవ క్రియేట్ చేసేలా…

Minister Kodali Nani makes personal comments against Chandrababu; Chandrababu counters | INDToday

చంద్రబాబు వ్యవహరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా గాని అక్కడ ఎవరికి ఎటువంటి గాయం కాలేదని పార్టీ కార్యాలయం లో వంశమైన సామాలు మొత్తం కరిగి 50 వేల రూపాయలు కూడా ఉండవని కొడాలి నాని తెలిపారు. ఈ క్రమంలో గొడవలను అదుపు చేయడానికి పోలీసులు దెబ్బలు తిన్నారు. సీఐ ఆసుపత్రిలో ఉన్నారు. అలాంటప్పుడు పోలీసులపై చంద్రబాబు అబండాలు వేయడం దారుణమని కొడాలి నాని కీలక కౌంటర్లు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp