Konijeti Rosaiah : రోశయ్య మరణం తీరని లోటు.. సీఎంలూ ఆయన పైనే ఆధారపడేవారని తెలుసా..!
Konijeti Rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య Konijeti Rosaiah కన్ను మూసారు. 88 ఏళ్ల రోశయ్య తెలుగు రాజకీయాల్లో దశబ్దాల పాటు కీలక నేతగా కొనసాగారు. తెలుగు రాజకీయాల్లో ఆయన స్వయంకృషితో ఎదిగారు. గత కొన్ని నెలలుగా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోశయ్యకు బీపీ డౌన్ అయి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.
రోశయ్య Konijeti Rosaiah మరణ వార్త విన్న రాజకీయ నేతలంతా షాక్ కు గురయ్యారు. అయన మృతి పట్ల పలువురు ప్రముఖులు ద్రిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. రోశయ్య Konijeti Rosaiah తెలుగు రాజకీయాల్లో ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ..ఎంపీగా చట్ట సభల్లో సుదీర్ఘ కాలం పని చేసారు. ఆంధ్ర ప్రదేశ్ కు 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా ఆయన రికార్డులకెక్కారు. 2009 వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం రోశయ్య ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు సీఏంగా పని చేసారు. అనంతరం తమిళనాడు గవర్నర్ గా కూడా పనిచేశారు.
Konijeti Rosaiah ప్రాణం విడిచే వరకు కాంగ్రెస్ లోనే రోశయ్య
కాంగ్రెస్ హాయంలో అత్యధిక సమయం మంత్రిగా పనిచేసిన అరుదైన రికార్డును కొణిజేటి రోశయ్య తన సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుంచి ప్రాణం విడిచే వరకు రోశయ్య కాంగ్రెస్ లోనే కొనసాగారు. రోశయ్య Konijeti Rosaiah కు కాంగ్రెస్ లో ఏ పదవి అప్పజెప్పినా.. దానికి నూటికి నూరు శాతం న్యాయం చేసేవారు. రోశయ్య చట్ట సభలో ప్రతి పక్షాలకు తన దైన శైలిలో చురకలు వేస్తూ ఉండేవారు. కొట్టి నట్టు మాట్లాడుతూనే తన మాటల గారడీతో అందరినీ ఆకట్టుకునేవారు.
Konijeti Rosaiah సీఏంలు రోశయ్యపైనే ఆధారపడేవారు
రోశయ్య 1968, 1974, 1980 లలో ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఎంత మంది సీఎంలు మారుతూ వచ్చినా… ప్రతిసారీ బడ్జెట్ విషయంలో గానీ ఏ ఇతర విషయాల్లో అయినా అందరూ రోశయ్య పైనే ఆధారపడేవారు. తమిళనాడు గవర్నర్ గా పదవీ విరమణ చేసిన అనంతరం రోశయ్య Konijeti Rosaiah ఇంటికే పరిమితమయ్యారు. ఆయన మరణ వార్త విని షాక్ కు గురైన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు ఇంకా కోలు కోలేదు.