Acharya: ‘ఆచార్య’ చిత్రానికి పాన్ ఇండియా రేంజ్ లేదు..కొరటాల కామెంట్స్ వైరల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Acharya: ‘ఆచార్య’ చిత్రానికి పాన్ ఇండియా రేంజ్ లేదు..కొరటాల కామెంట్స్ వైరల్..!

Acharya: ఆచార్య చిత్రానికి పాన్ ఇండియా రేంజ్ లేదు..అని తాజాగా చిత్ర దర్శకుడు కొరటాల శివ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామీలీ నుంచి వస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మీద భారీ అంచనాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి – ఆయన తనయుడు పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా అంటే అందరూ ఇన్నిరోజులు భావించింది ఖచ్చితంగా ఆచార్య సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ భాషలన్నిటిలో అలాగే హిందీలో […]

 Authored By govind | The Telugu News | Updated on :28 April 2022,5:00 pm

Acharya: ఆచార్య చిత్రానికి పాన్ ఇండియా రేంజ్ లేదు..అని తాజాగా చిత్ర దర్శకుడు కొరటాల శివ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామీలీ నుంచి వస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మీద భారీ అంచనాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి – ఆయన తనయుడు పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా అంటే అందరూ ఇన్నిరోజులు భావించింది ఖచ్చితంగా ఆచార్య సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ భాషలన్నిటిలో అలాగే హిందీలో కూడా రిలీజ్ చేస్తారని.

koratala comments going viral regarding acharya

koratala comments going viral regarding acharya-

లాస్ట్ మినిట్‌లో ఈ విషయాన్ని ప్రకటించి మేకర్స్ బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తారని ఎదురు చూశారు. కానీ, మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతున్న ఆచార్య సినిమాకు
సంబంధించి దర్శకుడు కొరటాల శివతో పాటుగా చిత్ర హీరోలు చిరంజీవి, చరణ్, హీరోయిన్ పూజా హెగ్డేలు ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆసక్తికరమైన చిత్ర విశేషాలు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొరటాల శివ ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేసే వీలు లేదని షాకిచ్చాడు. మెగా మల్టీస్టారర్ సినిమాకు ఆ రేంజ్ లేకపోవడం ఏంటీ అని అభిమానులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

Acharya: బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉన్నాయని..?

అయితే, వాస్తవంగా ఆచార్య చిత్రాన్ని ముందు పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేయాలనుకున్నట్టు చెప్పుకొచ్చిన కొరటాల శివ.. ఆ తర్వాత కరోనా ప్యాండమిక్‌ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కోసమే సమయం సరిపోకపోవడం..ఈ నేపథ్యంలో హీరోయిన్ కాజల్ తప్పుకోవడం సహా పలు మార్పులు ప్రాజెక్ట్‌లో చోటు చేసుకోవడం వల్ల ఆచార్య చిత్రాన్ని ఫైనల్‌గా ప్రాంతీయ చిత్రంగానే రిలీజ్ చేయాలని డిసైడయ్యామని తెలిపారు. అంటే, మిగతా భాషలలో డబ్బింగ్ చేసే సమయం కూడా దొరకలేదని, అలాగే బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉన్నాయని దీనిని బట్టి తెలుస్తోంది. చూడాలి మరి మరికొన్ని గంటల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఆచార్య ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది