
Acharya: ఆచార్య చిత్రానికి పాన్ ఇండియా రేంజ్ లేదు..అని తాజాగా చిత్ర దర్శకుడు కొరటాల శివ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామీలీ నుంచి వస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మీద భారీ అంచనాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి – ఆయన తనయుడు పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా అంటే అందరూ ఇన్నిరోజులు భావించింది ఖచ్చితంగా ఆచార్య సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ భాషలన్నిటిలో అలాగే హిందీలో కూడా రిలీజ్ చేస్తారని.
koratala comments going viral regarding acharya-
లాస్ట్ మినిట్‌లో ఈ విషయాన్ని ప్రకటించి మేకర్స్ బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తారని ఎదురు చూశారు. కానీ, మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతున్న ఆచార్య సినిమాకు
సంబంధించి దర్శకుడు కొరటాల శివతో పాటుగా చిత్ర హీరోలు చిరంజీవి, చరణ్, హీరోయిన్ పూజా హెగ్డేలు ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆసక్తికరమైన చిత్ర విశేషాలు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొరటాల శివ ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేసే వీలు లేదని షాకిచ్చాడు. మెగా మల్టీస్టారర్ సినిమాకు ఆ రేంజ్ లేకపోవడం ఏంటీ అని అభిమానులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు.
అయితే, వాస్తవంగా ఆచార్య చిత్రాన్ని ముందు పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేయాలనుకున్నట్టు చెప్పుకొచ్చిన కొరటాల శివ.. ఆ తర్వాత కరోనా ప్యాండమిక్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కోసమే సమయం సరిపోకపోవడం..ఈ నేపథ్యంలో హీరోయిన్ కాజల్ తప్పుకోవడం సహా పలు మార్పులు ప్రాజెక్ట్‌లో చోటు చేసుకోవడం వల్ల ఆచార్య చిత్రాన్ని ఫైనల్‌గా ప్రాంతీయ చిత్రంగానే రిలీజ్ చేయాలని డిసైడయ్యామని తెలిపారు. అంటే, మిగతా భాషలలో డబ్బింగ్ చేసే సమయం కూడా దొరకలేదని, అలాగే బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉన్నాయని దీనిని బట్టి తెలుస్తోంది. చూడాలి మరి మరికొన్ని గంటల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఆచార్య ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.