Kotamreddy Sridhar Reddy : బ్రేకింగ్.. కేసీఆర్ పార్టీ లోకి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి..!
Kotamreddy Sridhar Reddy ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం సంచలనంగా ఉంది. సొంత పార్టీ నేతలపై కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను కాక పూట్టిస్తున్నాయి. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. అని కొన్ని వాయిస్ రికార్డ్స్ ఇటీవల మీడియా ముందు బయట పెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ప్రభుత్వ అధికారులపై కూడా కోటంరెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే..
ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో కోటంరెడ్డి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఫిబ్రవరి 5వ తారీఖు ఆదివారం ఆ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కచ్చితంగా జగన్ మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు. వచ్చే ఎన్నికలలో మిమ్మల్ని గెలవనివ్వకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. సో ఇలాంటి పరిస్థితులలో మీ తర్వాత స్టెప్ ఏంటి..? అని యాంకర్ ప్రశ్నించడం జరిగింది.

Kotamreddy Sridhar Reddy into kcrs party
దీనికి కోటంరెడ్డి సమాధానమిస్తూ అయితే తెలుగుదేశం పార్టీలోకి లేకపోతే జనసేన అది కూదరకపోతే కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ లోకి వెళ్లిపోతానని.. ఎట్టి పరిస్థితులలో రాజకీయాలను వీడే ప్రసక్తి లేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు. అన్నిటికి తెగించే… ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పార్టీ నుండి రావాలని డిసైడ్ అయినట్లు.. పోరాటానికి రెడీ అయినట్లు చెప్పుకొచ్చారు. దీంతో కెసిఆర్ పార్టీ లోకి వేలబోతున్నట్లు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది.