YS Jagan : కృష్ణా జిల్లాలో ఆ వైసీపీ ఎమ్మెల్యేల చాప్టర్ క్లోజ్.. టికెట్ ఇచ్చే చాన్సే లేదంటున్న వైఎస్ జగన్
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వరకు సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. టీడీపీ అయితే సిట్టింగ్స్ అందరికీ సీట్లు అని ముందే ప్రకటించేసింది. ఇక.. వైసీపీ పార్టీ కూడా అంతే. దాదాపుగా సిట్టింగ్స్ కు టికెట్లు కన్ఫమ్ చేసినట్టే కానీ.. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఎందుకో వైఎస్ జగన్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కొందరు ఎమ్మెల్యే పనితీరుపై సీఎం జగన్ ఎందుకో కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి.. పనితీరు ఆధారంగానే ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తానని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.
అందులోనూ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లకు అయితే టికెట్ ఇచ్చే విషయంలో కొంచెం ఆలోచించే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం వైసీపీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచారు. నిజానికి వాళ్లంతా గెలిచింది వైసీపీ మీద ఉన్న అభిమానంతో. వాళ్లు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ల పనితీరు చూసుకున్నా అంతగా ఏం లేదు. తమ నియోజకవర్గాల్లో వాళ్లు అంతగా గుర్తింపు పొందింది కూడా లేదు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలలో కొందరికి టికెట్ దక్కే చాన్స్ అయితే లేదని అంటున్నారు.
YS Jagan : ఐదుగురిలో ఎవరు అవుట్ అవుతారో?
అవనిగడ్డ, పామర్రు, మైలవరం, కైకలూరు, నందిగామ.. ఈ నియోజకవర్గాల్లో ఎవరికి సీటు దక్కుతుందో తెలియదు కానీ.. అవనిగడ్డలో ఈసారి అంబటి రాంబాబును దింపుతారని ప్రచారం జరుగుతోంది. అలా.. కొత్త ఎమ్మెల్యేలను మార్చి.. వాళ్ల స్థానంలో వేరే వాళ్లకు చాన్స్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎవరి సీటు ఊడుతుందో.. ఎవరిది ఉంటుందో తెలియని పరిస్థితిలో ప్రస్తుతం ఆ కొత్త ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. చూద్దాం మరి.. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కదా. అప్పుడు జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో?