Kommineni – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి పుచ్చ పగిలే సమాధానం చెప్పిన కొమ్మినేని ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kommineni – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి పుచ్చ పగిలే సమాధానం చెప్పిన కొమ్మినేని !

Kommineni – Pawan Kalyan : ఇటీవల తెలంగాణ, ఏపీ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ జరిగిందనే అనుకోవాలి. రెండు ప్రభుత్వాలు మీ దగ్గర ఏముంది అంటే మీ దగ్గర ఏముంది అన్నంతగా కొట్టుకున్నాయి. దానికి కారణం.. ముందు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఏపీకి చెందిన కార్మికులను తెలంగాణలోనే సెటిల్ అవ్వాలని, తెలంగాణలోనే ఓటు హక్కు తీసుకోవాలని, ఏపీలో రద్దు చేసుకోవాలని చెప్పడంతో అది ఏపీ ప్రభుత్వానికి మంట పుట్టించింది. అసలు తెలంగాణలో ఏముందని […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 April 2023,2:00 pm

Kommineni – Pawan Kalyan : ఇటీవల తెలంగాణ, ఏపీ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ జరిగిందనే అనుకోవాలి. రెండు ప్రభుత్వాలు మీ దగ్గర ఏముంది అంటే మీ దగ్గర ఏముంది అన్నంతగా కొట్టుకున్నాయి. దానికి కారణం.. ముందు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఏపీకి చెందిన కార్మికులను తెలంగాణలోనే సెటిల్ అవ్వాలని, తెలంగాణలోనే ఓటు హక్కు తీసుకోవాలని, ఏపీలో రద్దు చేసుకోవాలని చెప్పడంతో అది ఏపీ ప్రభుత్వానికి మంట పుట్టించింది.

ksr comments pawan kalyan about he supporting harish raow ords

ksr comments pawan kalyan about he supporting harish raow ords

అసలు తెలంగాణలో ఏముందని అక్కడికి రమ్ముంటున్నారు. అక్కడ ఏముంది.. ఏం లేదు అంటూ ఏపీ మంత్రులు.. హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో ఏముంది అని అంటున్నారు కదా. ఇక్కడికి వస్తే తెలుస్తుంది అక్కడ ఏముందో అంటూ హరీశ్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రులకు. అయితే.. ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ మంత్ర హరీశ్ రావు మాట్లాడిన మాటలకు మద్దతు ఇస్తూ.. తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణను కించపరిచేలా ఏపీ మంత్రులు మాట్లాడారని ఓ వీడియోను విడుదల చేశారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan life is in danger

Kommineni – Pawan Kalyan : పవన్ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా?

ఒకప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులను దూషించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వాళ్లకు మద్దతుగా మాట్లాడుతున్నారు.. ఏపీ ప్రజలను తెలంగాణ మంత్రి అవమానిస్తే దాన్ని సమర్థించడం ఏంటంటూ ఏపీ మంత్రులు తాజాగా పవన్ పై కౌంటర్స్ వేస్తున్నారు. ఏపీ ప్రజలను అవమానిస్తే ఒక ఏపీ వ్యక్తిగా నువ్వు స్పందించవు. కానీ.. తెలంగాణను అవమానించారంటూ ఏపీ మంత్రులపై విరుచుకుపడతావా అంటూ ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పవన్ ను ఏకిపారేశారు. ఏపీ ప్రజలను అవమానిస్తే ఓకే కానీ.. తెలంగాణ ప్రజలను అవమానించారని ఆవేశపడ్డ పవన్ పై విమర్శల వర్షం కురిపించారు కొమ్మినేని. ఆంధ్రులను అవమానించేలా తెలంగాణ మంత్రులు వ్యాఖ్యానిస్తే ఖండించాల్సిన పవన్ కళ్యాణ్.. వాళ్లకు మద్దతుగా మాట్లాడటం.. ఆంధ్రుల అత్మాభిమానాన్ని వేరే వారికి తాకట్టు పెట్టడమే అని మండిపడ్డారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది