KTR : చెక్‌డ్యామ్ కూడా సరిగ్గా కట్టలేని కాంగ్రెస్ నేతలు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం విడ్డురం – కేటీఆర్
KTR fire on Congress Govt : మహబూబ్ నగర్ జిల్లాలో చెక్‌డ్యామ్ కొట్టుకుపోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగుపై రెండు నెలల క్రితం నిర్మించిన చెక్‌డ్యామ్ ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెడుతూ.. ఈ ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెక్‌డ్యామ్ కొట్టుకుపోయిన వీడియోను కూడా ఆయన తన పోస్ట్‌కు జత చేశారు. కాంగ్రెస్ కాంట్రాక్టర్ల నాసిరకం పనుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆరోపించారు.

#image_title
ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వడం, సుంకిశాల రిటైనింగ్ వాల్ కట్టడం వంటి పెద్ద పనులు చేతకాకపోయినా, కనీసం ఒక చిన్న వాగుపై చెక్‌డ్యామ్ కూడా సరిగా నిర్మించలేని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి అసమర్థత ఉన్న నేతలు ఇంజినీరింగ్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గుడిబండ పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ కేవలం రెండు నెలల్లోనే కొట్టుకుపోవడానికి గల కారణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించాలని డిమాండ్ చేశారు.
నాణ్యత లేకుండా నాసిరకం పనులు చేసి, రైతుల పొలాలు, మోటార్ పైప్‌లైన్లు, చివరికి ట్రాన్స్‌ఫార్మర్ కూడా కొట్టుకుపోవడానికి కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు కానీ, కనీసం ఒక్క ఇటుకను కూడా సరిగా పేర్చలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కు నేలకు రాసి, మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోవద్దని ఎద్దేవా చేశారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
SLBC టన్నెల్ తొవ్వడం చేతకాదు..
సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు..
చివరికి ఓ చెక్ డ్యామ్ ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ సన్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం సిగ్గుచేటు..
మహబూబ్ నగర్ లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్… pic.twitter.com/jD5fctDGM6
— KTR (@KTRBRS) August 19, 2025